English | Telugu

చెర్రీ, శీను వైట్ల చిత్రం అక్టోబర్ లో

చెర్రీ, శీను వైట్ల చిత్రం అక్టోబర్ లో ప్రారంభమవుతుందని విశ్వసనీయవర్గాల ద్వారా అందిన సమాచారం. శీను వైట్ల ఇటీవల మహేష్ బాబు హీరోగా దర్శకత్వం వహించిన "దూకుడు" బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది. దీని తర్వాత యంగ్ టైగర్ యన్.టి.ఆర్.హీరోగా, బండ్ల గణేష్ నిర్మించబోయే చిత్రానికి దర్శకత్వం వహిస్తారు. దీని తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, మెగా ప్రొడ్యుసర్ అశ్వనీదత్ నిర్మించబోయే చిత్రానికి కూడా శీను వైట్ల దర్శకత్వం వహింస్తారు.

ఈ చిత్రం అక్టోబర్ నెలలో దసరా సందర్భంగా ప్రారంభం అవుతుందని ఫిలిం నగర్ వర్గాలంటున్నాయి. రామ్ చరణ్ తేజ ప్రస్తుతం రచ్చ, ఎవడు చిత్రాలతో పాటు వినాయక్ దర్శకత్వం వహించే చిత్రంలో కూడా హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రాల తర్వాత రామ్ చరణ్, శీనువైట్ల సినిమా ప్రారంభమవుతుంది.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.