English | Telugu

"సూపర్ రాజా" అవుతున్న సునీల్

"సూపర్ రాజా" అవుతున్న సునీల్ అంటే అదే సునీల్ హీరోగా నటిస్తున్న సినిమా అనుకునేరు. కాదండీ బాబూ...! "సూపర్ రాజా" అనేది సునీల్‍ కి వచ్చిన కొత్త టైటిల్‍ అట. అంటే చిరంజీవికి మెగాస్టార్, పవన్ కళ్యాణ్ కి పవర్ స్టార్, నాగార్జునకి యువసామ్రాట్, బాలకృష్ణకి యువరత్న, వెంకటేష్ కి విక్టరీ, రవితేజకి "మాస్ మహరాజా", అల్లరి నరేష్ కి "మాస్ రాజా", అల్లు అర్జున్ కి స్టైలిష్ స్టార్, రామ్ చరణ్ కి మెగాపవర్ స్టార్ వంటి బిరుదులు ఎలాగున్నాయో, అలాగే సిక్స్ ప్యాక్ సునీల్ కి కూడా ఈ "సూపర్ రాజా" అనే బిరుదుని "పూలరంగడు" చిత్రంలో దర్శకుడు వీరభద్రం చౌదరి టైటిల్స్ లో వేస్తున్నారని విశ్వసనీయవర్గాల ద్వారా అందిన సమాచారం. సో ఇక నుంచీ సునీల్ మామూలు సునీల్ కాదన్నమాట. సునీల్ బాబు పేరు ముందు "సూపర్ రాజా" సునీల్ బాబు అని వ్రాయాలి కాబోలు...!

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.