English | Telugu
ఎన్టీఆర్ కాదు.. బుచ్చిబాబు 'పెద్ది'లో రామ్ చరణ్!
Updated : Nov 22, 2022
'ఉప్పెన'(2021)తో దర్శకుడిగా పరిచయమై మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న బుచ్చిబాబు.. తన రెండో సినిమాని జూనియర్ ఎన్టీఆర్ తోనే చేయాలని చాలాకాలం ఎదురుచూశాడు. అయితే ఎన్టీఆర్ ఇప్పటికే తన 30వ సినిమాని కొరటాల శివతో, 31వ సినిమాని ప్రశాంత్ నీల్ తో ప్రకటించాడు. కానీ కొన్ని కారణాల వల్ల 'ఎన్టీఆర్ 30' ఆలస్యమవుతూ వస్తోంది. ఎన్టీఆర్ చేస్తున్న ఈ రెండు సినిమాలు పూర్తి కావాలంటే కనీసం రెండేళ్లు పడుతుంది. అందుకే బుచ్చిబాబు, రామ్ చరణ్ తో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నట్టు ఇటీవల వార్తలొచ్చాయి. అయితే ఆ వార్తలు నిజమేనని, త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుందని అంటున్నారు.
ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో తన 15వ సినిమాని చేస్తున్నాడు చరణ్. ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ సగం పూర్తయింది. అలాగే తన 16వ సినిమాని 'జెర్సీ' ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో చేస్తున్నట్టు ప్రకటించాడు చరణ్. కానీ ఏవో కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ ని పక్కనపెట్టాడు. ఇక ఇప్పుడు బుచ్చిబాబు డైరెక్షన్ లో మూవీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇదే చరణ్ చేయబోయే 16వ సినిమా అని ప్రచారం జరుగుతోంది.
ఎన్టీఆర్ కోసం బుచ్చిబాబు 'పెద్ది' అనే పవర్ ఫుల్ స్పోర్ట్స్ డ్రామాను రాశాడు. ఇప్పుడు అదే కథను చరణ్ కి వినిపించగా ఆయన వెంటనే ఓకే చెప్పినట్టు సమాచారం. మైత్రి మూవీ మేకర్స్ కి సన్నిహితుడు సతీష్ కిలారు ఈ చిత్రంతో నిర్మాతగా మారనున్నారని టాక్. రూ.150 కోట్ల బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో ఈ మూవీ రూపొందనుందని న్యూస్ వినిపిస్తోంది.