English | Telugu

నర్సింగరావుకు 'మొరాకన్ స్టార్' పురస్కారం

ప్రముఖ సినీ దర్శకుడు, చిత్రకారుడు, రచయిత బి. నర్సింగరావు మొరాకో దేశం ఇచ్చే అత్యున్నత పురస్కారం 'మొరాకన్ స్టార్'ను స్వీకరించారు.తెలంగాణ కళల పునరుజ్జీవన శిల్పిగా అభివర్ణిస్తూ పది జాతీయ పురస్కారాలు, తొమ్మిది అంతర్జాతీయ పురస్కారాలు ఇటీవల కాలంలో ఆయన్ని వరించాయి. తెలంగాణ ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తం చేసేందుకు తన వంతు కృషి చేసినట్లు బి. నర్సింగరావు తెలిపారు. తన సాంస్కృతిక ప్రయాణంలో విజయవంతం అయినందుకు ఆయన సంతోషం వ్యక్తం చేశారు.

ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ సంస్థలు విశిష్ట వ్యక్తుల పేరిట నెలకొల్పిన పురస్కారాలు తనకు లభించాయని సోమవారం నర్సింగరావు మీడియాకు తెలిపారు. రంగస్థలం, సినిమా, సంగీతం, చిత్రలేఖనం, శిల్పం, సాహిత్యం, జానపదం, ఫోటోగ్రఫీ రంగాల్లో ఎన్నో దశాబ్దాలుగా తాను చేసిన కృషికి గుర్తింపు లభించిందని ఆయన సంతోషం వెలిబుచ్చారు. సింగపూర్‌కు చెందిన 'ది ఎలైట్ ఫెడరేషన్ అఫ్ వరల్డ్ కల్చరల్ అండ్ ఆర్ట్ సొసైటీ' తనను గుర్తించి అంతర్జాతీయ సాంస్కృతిక గౌరవ సలహాదారుగా నియమించినట్లు తెలిపారు. ఆ సంస్థ 160 దేశాలకు విస్తరించి ఉందని ఆయన వివరించారు. మొరాకో దేశం 'మొరాకన్ స్టార్' పురస్కారంతో పాటు గౌరవ డాక్టరేట్ ఇచ్చి గౌరవించిందని నర్సింగరావు తెలిపారు. ఫీలిప్పిన్ దేశం నుంచి కూడా గౌరవ డాక్టరేట్ స్వీకరించినట్లు తెలిపారు. ఇంగ్లాండ్‌కు చెందిన ఉమెన్ ఆఫ్ హార్ట్స్ సంస్థ 'ఎ జెంటిల్‌మన్ ఆఫ్ హార్ట్స్' అవార్డుతో సత్కరించినట్లు చెప్పారు. కజకిస్తాన్, వెనిజులా దేశాలు అత్యున్నత పురస్కారాలు ప్రకటించాయి.

దాదాపు ప్రపంచంలోని అన్ని అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్ ప్రత్యేక ప్రశంసలు అందించినట్లు నర్సింగరావు తెలిపారు. తనకు కవిత్వం రాయడం ఇష్టమని, 24 వాల్యూమ్ ల కవిత్వం రాశానని, పది వాల్యూమ్స్ ప్రచురించానని తెలిపారు. ఆక్స్‌ఫోర్డ్ యూనివర్సిటీ రూపొందించిన 'ది ఎన్‌సైక్లోపీడియా ఆఫ్ ఇండియన్ సినిమా' గ్రంథంలో తన సినిమాల గురించి ప్రచురించిందని దర్శక రచయిత నర్సింగరావు చెప్పారు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.

ఓటిటి లో శంబాల రెస్పాన్స్ ఇదే.. ఇది అసలు రికార్డునే కాదు

 కొన్ని చిత్రాలు అంతే.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి థియేటర్స్ దగ్గర జాతర వాతావరణాన్ని తీసుకొస్తాయి. అలాంటి వాతావరణాన్ని శంబాల(Shambala)తీసుకొచ్చింది. పైగా చిన్న చిత్రాలకి సరికొత్త ఊపిరిని తీసుకొచ్చి ఆది సాయికుమార్ కెరీర్ కే కాదు, తెలుగు చిత్ర పరిశ్రమకే సరికొత్త సినీ యవ్వనాన్ని తీసుకొచ్చింది. భారీ వసూళ్లని అవలీలగా సాధించిన శంబాల జనవరి 22 నుంచి ఆహా(Aha) వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే  . థియేటర్స్ లో లాగానే ఓటిటి వేదికగా సరికొత్త రికార్డ్స్ ని సెట్స్ చేస్తూ అందరు తనవైపు చూసేలా చేస్తుంది. మరి మనం కూడా సదరు రికార్డ్స్ పై లుక్ వేద్దాం