English | Telugu

వేలానికి రామ్ చరణ్ జాకెట్

వేలానికి రామ్ చరణ్ జాకెట్. ఇదేంటి మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ జాకెట్ అమ్ముతున్నాడా...? అమటే అవుననే సమాధానం చెప్పాలి. దీనికి ఒక మంచి కారణం ఉంది. అమెరికాలో ప్రస్తుతం జరుగుతున్న నాట్స్ ఉత్సవాలకు వెళ్ళిన యువ హీరో రామ్ చరణ్, అక్కడ పోయిన సంవత్సరం ఒక ప్రమాదానికి గురైన ఇద్దరు అమ్మాయిలు అపర్ణ, అర్చన ఇద్దర్లో అర్చన అనే అమ్మాయికి హాస్పిటల్లో వెన్నెముక చికిత్స చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఆమె చికిత్సకు అవసరమయ్యే ధన సేకరణ నిమిత్తం "ఆరెంజ్" చిత్రంలో తాను ధరించిన యెల్లో జాకెట్ ను యువ హీరో రామ్ చరణ్ తేజ వేలానికి పెట్టారు. ఆ వేలంలో వచ్చిన ధనాన్ని అర్చన చికిత్స నిమిత్తం ఆయన ఇవ్వనున్నారు. ఈ సభలకు రామ్ చరణ్ తో పాటు ప్రియామణి, కామ్నా జెఠ్మలానీ, మధుశాలిని, స్నేహ గులేటి తదితరులు హాజరయ్యారు. అక్కడ నాట్స్ వారు "యూత్ ఐకాన్" అవార్డుతో రామ్ చరణ్ ని సన్మానించారు.

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.