English | Telugu

రజనీ కాంత్ రాణాలో హీరోయిన్ పాట పూర్తి

రజనీ కాంత్ "రాణా" లో హీరోయిన్ పాట పూర్తి అయ్యిందని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం. వివరల్లోకి వెళితే సౌతిండియన్ సూపర్ స్టార్ రజనీ కామత్ హీరోగా, ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ దీపిక పదుకునే, నలకనడుము గోవా భామ ఇలియానా హీరోయిన్లుగా, కె.యస్.రవికుమార్ దర్శకత్వంలో నిర్మించబడే భారీ బడ్జెట్ చిత్రం "రాణా". ఈ సినిమా ప్రారంభోత్సవం రోజునే హీరో రజనీ కాంత్ అనారోగ్యం పాలవటం, సింగపూర్ లో ట్రీట్ మెంట్ తీసుకుని ఇటీవలే చెన్నైకి తిరిగి రావటం మనకు తెలిసిందే.

ఆ రజనీ కాంత్ "రాణా" చిత్రంలో హీరోయిన్ ఇంట్రడక్షన్ సాంగ్ ని ఇప్పటికే పూర్తి చేశారట ఈ చిత్రం యునిట్. ఆ పాట ఎలా వచ్చిందో డి.వి.డి.రూపంలో రజనీ కాంత్ కి చూపుతారట. రజనీ కాంత్ ఆగస్ట్ 14 వ తేదీన తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని, ఆయన ఆశీర్వాదం తిసుకున్న తర్వాతే ఈ "రాణా" చిత్రం షూటింగ్ లో పాల్గొంటారట.

రూమర్స్ కి చెక్.. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మొత్తం చెప్పేసింది

సిల్వర్ స్క్రీన్ పై పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)స్టామినాని మరింతగా ఎలివేట్ చెయ్యబోతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad.ఇప్పటి వరకు రిలీజైన ప్రచార చిత్రాల ద్వారా ఆ విషయం అర్ధమవుతుండటంతో పాటు దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఆ విషయంలో అభిమానులకి, ఫ్యాన్స్ కి పూర్తి భరోసాని ఇస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవికి థియేటర్స్ లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి ప్రముఖ హీరోయిన్ సాక్షి వైద్య చెప్పిన కొన్ని విషయాల ద్వారా ఎప్పట్నుంచో సినీ సర్కిల్స్ లో దర్జాగా చక్కర్లు కొడుతున్న ఒక పుకారు కి  పుల్ స్టాప్ పడినట్లయింది.