English | Telugu

తమన్నాకి మతి పోయింది

తమన్నాకి మతి పోయింది అని సినీ వర్గాలమటున్నాయి. మతి పోవటమంటే నిజంగా పోవటమని కాదు. వివరాల్లోకి వెళితే శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై, యంగ్ టైగర్ యన్ టి ఆర్ హీరోగా, మిల్కీవైట్ బ్యూటీ తమన్నా భాటియా హీరోయిన్ గా, సురేంద్ర రెడ్డి దర్శకత్వంలో, బి.వి.యస్.యన్.ప్రసాద్ నిర్మిస్తున్న విభిన్నకథా చిత్రం "ఊసరవెల్లి". ఈ చిత్రంలో హీరోయిన్ తమన్నాకి మెమొరీ లాస్ అనే జబ్బు ఉంటుందట. అంటే జ్ఞాపక శక్తి పోవటం అన్నమాట.

హీరోయిన్ మామూలుగా యాపిల్ పండులా ఉండి మాంచి తెలివితేటలుంటేనే జనం చూడాలా వద్దా అని ఆలోచిస్తున్నారు. మరి మతిపోయిన హీరోయిన్ అంటే ఎలాచూస్తారో.అయినా కథకి అవసరమై హీరోయిన్ని అలా చూపిస్తున్నారేమోలెండి. ఈ సినిమా ఎలా ఉండేదీ రానున్న దసరాకి తేలిపోతుందిగా...ఈ చిత్రానికి రసూల్ ఎల్లోర్ కెమెరామేన్ గా, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్ గా, కొరటాల శివ మాటల రచయితగా పనిచేస్తున్నారు. వక్కంతం వంశీ ఈ చిత్రానికి కథనందించారు.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.