English | Telugu

ర‌జ‌నీకాంత్‌కి కొత్త స‌మ‌స్య‌

కొచ్చ‌డ‌యాన్ ర‌జ‌నీకాంత్ ని ఇంకా వెంటాడుతూనే ఉంది. ఈ సినిమాతో బ‌య్య‌ర్లు పూర్తిగా న‌ష్ట‌పోయారు. ర‌జ‌నీ ఇమేజ్‌కీ మ‌చ్చ‌లా త‌యారైంది. ఇప్పుడు కోర్టు కేసులు, గొడ‌వ‌లూ అంటూ... ర‌జ‌నీ ని మ‌రింత చికారు పెడుతోంది. ఇప్పుడు తాజాగా ఈ సినిమాపై ఓ కేసు న‌మోద‌య్యింది. అయితే ర‌జ‌నీకాంత్‌పై కాదు.. భార్య ల‌తా ర‌జ‌నీకాంత్‌పై. ఎందుకంటే ఈ సినిమా ఆర్థిక వ్య‌వ‌హారాలు, పంపిణీ విష‌యాలూ ఆమే ద‌గ్గ‌రుండి చూసుకొంది. కొచ్చ‌డ‌యాన్ పంపిణీ హ‌క్కులు త‌న‌కు ఇస్తాన‌ని చెప్పి మోసం చేశార‌ని మ‌నోహ‌ర్ అనే పంపిణీ దారుడు కేసు వేశాడు. ప‌ది కోట్ల రూపాయ‌లు త‌న ద‌గ్గ‌ర నుంచి తీసుకొని, మ‌రోక‌రికి పంపిణీ హ‌క్కులు ఇచ్చేశార‌ని, ఆ ప‌ది కోట్లు తిరిగి చెల్లించ‌డం లేద‌ని.. కేసు వేశాడు. ఈ వ్య‌వ‌హారంలో నిజం ఉందా? లేదంటే కేవ‌లం ప‌బ్లిసిటీ కోస‌మే ఇదంతా చేస్తున్నాడా? అనేది తేలాల్సివుంది. ర‌జ‌నీకాంత్ కొత్త సినిమా లింగా ఈనెల 12న విడుద‌ల కాబోతోంది. ఈ సినిమాకి ముందు ఇలాంటి కోర్టు వ్య‌వ‌హారాలు త‌ల‌నొప్పే. మ‌రి కొచ్చ‌డ‌యాన్ బృందం ఎలాంటి నిర్ణ‌యం తీసుకొంటుందో, ఈ ఫిర్యాదుని ఎలా తిప్పి కొడుతుందో చూడాలి.