English | Telugu
మెగాస్టార్, సూపర్ స్టార్ కాంబోలో మూవీ..వెల్లడి చేసిన రజనీకాంత్
Updated : Oct 25, 2023
వాళ్లిదరు భారతీయ చిత్ర పరిశ్రమకే గర్వకారమైన నటులు. ఎన్నో సినిమాల్లో ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించి తన నటనతో భారత దేశవ్యాప్తంగా అభిమానులని సంపాదించుకున్నారు. ఆ ఇద్దరి గురించి ఏ చిన్న వార్త వచ్చినా సరే అది పెద్ద సంచలనమే అవుతుంది. వాళ్ళిద్దరి అభిమానులు ఎప్పటినుంచో కోరుకుంటున్న ఒక వార్త ఇప్పుడు నిజం అయ్యింది. ఇక అంతే భారతదేశ వ్యాప్తంగా ఆ ఇద్దరి అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.
సూపర్ స్టార్ రజనీకాంత్, ఇండియా మెగా స్టార్ అమితాబ్ బచ్చన్ లు కలిసి ఒక చిత్రం లో నటించబోతున్నారు. ఈ వార్త ని అధికారకంగా రజనీకాంత్ తన ఎక్స్ వేదికగా వెల్లడి చేసాడు. రజనీకాంత్ ఎప్పుడైతే ఈ వార్తని ప్రకటించాడో ప్రస్తుతం ఆ వార్త టాక్ ఆఫ్ ది ఇండియన్ సినిమా అయ్యింది. అలాగే ఈ సందర్భాన్ని పురస్కరించుకొని అమితాబ్ బచ్చన్ మీద తనకున్న గురువాత్సల్యాన్ని కూడా రజనీ తన సోషల్ మీడియా అకౌంట్ లో ప్రస్తావించాడు. 33 సంవత్సరాల తర్వాత తన గురువు తో కలిసి నటించబోతున్నానని అలాగే నటనలో నేను రాణించటానికి,నిలదొక్కుకోవడానికి ఇన్స్పిరేషన్ గా నిలిచిన ఒక అద్భుతమైన పర్సనాలిటీ తో పని చెయ్యబోతున్నందుకు కూడా చాలా ఆనందంగా ఉందని తన ఎక్స్ వేదికగా చెప్పాడు.
తలైవా తన 170 వ చిత్రాన్ని టి .జె జ్ఞానవేల్ దర్శత్వం లో చేస్తున్నాడు. ఇప్పుడు ఈ సినిమాలో నే అమితాబ్ రజనీ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబుతున్నాడు. లేటెస్ట్ గా జైలర్ తో రజనీ ఇండియా వ్యాప్తంగా రికార్డు లు క్రియేట్ చేసి ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. ఇప్పుడు అమితాబ్ తో కలిసి రజనీ ఇంకెన్ని రికార్డులు బద్దలు కొడతాడో చూడాలి. రజనీ అండ్ అమితాబ్ లు హం,అందా కనున్, గెరాఫ్తార్ అనే మూడు చిత్రాల్లో కలిసి నటించారు. ఆ మూడు చిత్రాలు కూడా 1983 ,85 ,91 సంవత్సరాల్లో వచ్చాయి.