English | Telugu
మెగాస్టార్ మూవీకి దిల్ రాజు టైటిల్.. అన్నీ సర్ ప్రైజ్ లే!
Updated : Oct 25, 2023
మెగాస్టార్ చిరంజీవి తన 156వ సినిమాని 'బింబిసార' ఫేమ్ మల్లిడి వశిష్ట దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సోషియో ఫాంటసీ ఫిల్మ్ దసరా రోజున పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ఈ ఏడాది చివరిలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళే అవకాశముంది. ఇదిలా ఉంటే ఈ సినిమాకి 'విశ్వంభర' అనే ఆసక్తికర టైటిల్ ని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
ఇంద్రగంటి మోహనకృష్ణ డైరెక్షన్ లో 'జటాయు', శైలేష్ కొలను డైరెక్షన్ లో 'విశ్వంభర', ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో 'రావణం' అనే సినిమాలు చేయనున్నట్లు గతంలో దిల్ రాజు ప్రకటించారు. ఈ సినిమాలు ఎప్పుడు మొదలవుతాయో తెలీదు కానీ..మూడూ కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్నాయని సమాచారం. అయితే ఇప్పుడు మూడు సినిమాల టైటిల్స్ లో ఒకదానిని మెగాస్టార్ సినిమాకి పెడుతున్నారనే ఆసక్తికరంగా మారింది.
'మెగా 156'కి మొదట 'ముల్లోకాల వీరుడు' అనే టైటిల్ ని అనుకున్నట్లు వార్తలొచ్చాయి. అయితే ఇప్పుడు దాని స్థానంలో 'విశ్వంభర' అనే టైటిల్ ని ఖరారు చేసినట్లు న్యూస్ బలంగా వినిపిస్తోంది. మరి మెగాస్టార్ కోసం దిల్ రాజు ఆ టైటిల్ త్యాగం చేశారా? లేక యూవీ క్రియేషన్స్ ముందుగానే టైటిల్ రిజిస్టర్ చేయించిందా అనేది తెలియాల్సి ఉంది.
రూ.200 కోట్లకు పైగా బడ్జెట్ తో రూపొందనున్న 'మెగా 156'లో రానా దగ్గుబాటి విలన్ గా నటించనున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమా రెండు భాగాలుగా రానుందని ప్రచారం జరుగుతోంది.