English | Telugu

'మా' అధ్యక్ష బరిలో రాజేంద్రప్రసాద్

సినిమాలలో నవ్వులతో ప్రజలను మెప్పించిన నటుడు డా. రాజేంద్రప్రసాద్ ఇప్పుడు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ‘మా’ అధ్యక్షుడి కోసం జరగనున్న ఎన్నికల్లో పోటీచేస్తున్నట్లు వెల్లడించారు. ఏదో ఒక సేవారంగంలో ఉండాలని అనుకుంటున్నానని, ఈ లోపు మా ఎన్నికలు రావడం సంతోషకరంగా ఉందని తెలిపారు. స్నేహితులు, కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతోనే ఎన్నికల బరిలో దిగుతున్నానని చెప్పారు. గతంలో ‘మా’ ఎన్నికలలో పోటీ చేసిన రాజేంద్రప్రసాద్ మురళీమోహన్‌పై కేవలం ఏడు ఓట్ల తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే. ఆ తరువాత నటుడిగా తన కెరీర్ పై దృష్టి సారించారు. ఈసారైనా 'మా' అధ్యక్ష పదవి రాజేంద్రప్రసాద్‌ని వరిస్తుందో లేదో చూద్దాం.

ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్.. పోస్టర్ రిలీజ్ చేసిన చిత్ర బృందం

సంక్రాంతికి  వెల్ కమ్ చెప్తు నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి నిన్న 'అనగనగ ఒక రాజు'(Anaganaga Oka Raju)తో సిల్వర్ స్క్రీన్ పై తమ సత్తా చాటడానికి అడుగుపెట్టారు. అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్  అధినేత నాగవంశీ నిర్మాత కావడం ఈ చిత్రం స్పెషాలిటీ. నూతన దర్శకుడు మారి(Maari)దర్శకత్వంలో పూర్తి గ్రామీణ వాతావరణం నేపథ్యంలో తెరకెక్కగా, మార్నింగ్ షో నుంచే   పాజిటివ్ టాక్  తో దూసుకుపోతుంది.  దీంతో సంక్రాంతి పందెంలో ఈ చిత్రం సాధించే కలెక్షన్స్ పై అందరిలో ఆసక్తి నెలకొని ఉండగా, చిత్ర బృందం మొదటి రోజు కలెక్షన్స్ ని అధికారకంగా ప్రకటించింది.