English | Telugu

అనుష్క రుద్రమదేవి ట్రైలర్ వచ్చేసింది..!!!

అనుష్క ప్రధాన పాత్రలో గుణశేఖర్ దర్శకత్వంలో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్నరుద్రమదేవి థియేటర్ ట్రైలర్ విడుదలై౦ది. గుణశేఖర్ చెప్పినట్టే రుద్రమదేవి ట్రైలర్ ఈ రోజు సాయంత్రం 6గంటలకు విడుదల చేశారు. ఇందులో మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సి౦ది అనుష్క. రుద్రమదేవి గా చాలా పవర్ ఫుల్ కనిపించింది అనుష్క. డైలాగులతో కూడా అదరగొట్టేసింది. అలాగే ఈ ట్రైలర్ లో మెయిన్ హైలైట్ గా అల్లుఅర్జున్ నిలిచారని చెప్పాలి. గోనగన్నారెడ్డి పాత్రలో బన్నీ ఇరగదీసాడు. బన్నీ లుక్, చెప్పే డైలాగ్స్ చాలా పవర్ ఫుల్ గా వున్నాయి. వార్ సీన్లను గుణశేఖర్ ప్రత్యేకంగా డీజైన్ చేసినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.

ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్.. పోస్టర్ రిలీజ్ చేసిన చిత్ర బృందం

సంక్రాంతికి  వెల్ కమ్ చెప్తు నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి నిన్న 'అనగనగ ఒక రాజు'(Anaganaga Oka Raju)తో సిల్వర్ స్క్రీన్ పై తమ సత్తా చాటడానికి అడుగుపెట్టారు. అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్  అధినేత నాగవంశీ నిర్మాత కావడం ఈ చిత్రం స్పెషాలిటీ. నూతన దర్శకుడు మారి(Maari)దర్శకత్వంలో పూర్తి గ్రామీణ వాతావరణం నేపథ్యంలో తెరకెక్కగా, మార్నింగ్ షో నుంచే   పాజిటివ్ టాక్  తో దూసుకుపోతుంది.  దీంతో సంక్రాంతి పందెంలో ఈ చిత్రం సాధించే కలెక్షన్స్ పై అందరిలో ఆసక్తి నెలకొని ఉండగా, చిత్ర బృందం మొదటి రోజు కలెక్షన్స్ ని అధికారకంగా ప్రకటించింది.