English | Telugu

రాజేంద్రప్రసాద్ కుమారుడి వెడ్డింగ్ రిసెప్షన్

నటకిరీటి రాజేంద్రప్రసాద్‌ కుమారుడు బాలాజీ వివాహ రిసెప్షన్‌ మాదాపూర్‌ శిల్పాకళావేదికలో గ్రాండ్ గా జరిగింది. బాలాజీ వివాహం,శివ శంకరితో ఫిబ్రవరి 2 ఉదయం చెన్నైలోని శ్రీవారు వెంకటాచలపతి ప్యాలెస్‌లో ఘనంగా జరిగింది. బాలాజీ వివాహ రిసెప్షన్‌ టాలీవుడ్ ప్రముఖలంతా పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు. మరోవైపు రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రలో నటించిన దాగుడు మూత దండాకోర్ ఈ నెల 13న విడుదల కానుంది.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.