English | Telugu

ఈ మాత్రం దానికి అంత సెటప్‌ అవసరమా? రాజమౌళిపై వెల్లువెత్తుతున్న విమర్శలు!

ఎంతోకాలంగా ప్రేక్షకులు, అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న మహేష్‌, రాజమౌళి సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్‌ వచ్చాయి. ఈ సినిమాకి టైటిల్‌ వారణాసి, ఈ సినిమాను ఒరిజినల్‌ ఐమాక్స్‌ ఫార్మాట్‌లో కూడా చేస్తున్నారు. 2027 మార్చి 25న సినిమాను రిలీజ్‌ చేస్తున్నారు. ఈ సినిమాలో మహేష్‌ శ్రీరాముడిగా కనిపించబోతున్నాడు. కథ గురించి ఒక్క మాట కూడా చెప్పకుండా దానికి సంబంధించిన ఒక వీడియోను క్రియేట్‌ చేసి విడుదల చేశారు.. ఇవీ మహేష్‌, రాజమౌళి సినిమాకి సంబంధించిన అప్‌డేట్స్‌.

అంతవరకు బాగానే ఉంది. ఎప్పుడో ఏడాదిన్నర తర్వాత విడుదల కాబోతున్న సినిమాకి ఇప్పటి నుంచే ఇంత బిల్డప్‌ అవసరమా అనే కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు ఏ ఆడియో ఫంక్షన్‌గానీ, ప్రీరిలీజ్‌ ఈవెంట్‌గానీ, హండ్రెడ్‌ డేస్‌ ఫంక్షన్‌గానీ ఈ రేంజ్‌లో చేయలేదన్నది వాస్తవం. కానీ, నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమాకి ఇంత బిల్డప్‌ అవసరమా అనేది కొందరి ప్రశ్న. అయితే ఇలా ఎందుకు చేశారు అనే దాని మీద రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మొదటిది సినిమా మీద వారికి ఒక అపనమ్మకం ఉండి ఉండాలి. లేక సినిమా ఎలా ఉండబోతోంది, ఏయే అంశాలు సినిమాలో ప్రస్తావించబోతున్నారు అనే విషయాల గురించి ముందుగానే సమాచారం అందించే ప్రయత్నం అయి ఉండాలి. సినిమాకి సంబంధించి విడుదల చేసిన వీడియోలో 90 శాతం ఎఐలో చేసిన కంటెంటే కనిపిస్తోంది. మహేష్‌కి సంబంధించిన సీన్‌ ఒక్కటే ఒరిజినల్‌గా తీసినట్టుగా ఉంది. ఆ మాత్రం కంటెంట్‌ చూపించేందుకు 100 అడుగుల స్క్రీన్‌, దాన్ని మెయిన్‌టెయిన్‌ చెయ్యడానికి 45 జనరేటర్లు అవసరమా అనే కామెంట్‌ వినిపించింది.

ఇంత భారీగా చేసిన ఈవెంట్‌లో రాజమౌళి అసహనంగా కనిపించడం, అతని మాటల్లో తప్పులు దొర్లడం వంటివి చూస్తుంటే.. అతని మానసిక స్థితి సరిగ్గా లేదనేది అర్థమవుతోందని, ఫంక్షన్‌ని పూర్తిగా చూడాలని కూడా అనిపించలేదని కొందరు కామెంట్స్‌ పెడుతున్నారు. తన సినిమాకి సంబంధించి ఏ ఈవెంట్‌ జరిగినా ఎంతో ప్లెజెంట్‌గా కనిపించే రాజమౌళిలో ఈసారి అది మిస్‌ అయిందని చాలా మంది గమనించారు.

వేలాదిగా అభిమానులు తరలి వచ్చినప్పటికీ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రశాంతంగా ఈవెంట్‌ ముగిసింది అనే సంతృప్తి తప్ప దీని వల్ల సినిమాకి ఒరిగింది ఏమీ లేదని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఏది ఏమైనా రాజమౌళి చేసిన గత సినిమాల తళుకు బెళుకులు, ప్రేక్షకుల్ని సంభ్రమాశ్చర్యాలకు గురిచేసే అంశాలు ఈ సినిమాలో కనిపించలేదని మహేష్‌ అభిమానులు సైతం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

సినిమాకి ఉన్న శక్తిని మరోసారి చాటి చెప్పావు.. వాళ్ళు భయపడుతున్నారంట! 

కళ.. పేరుగా చూసుకుంటే నామ్ చోటా.. కానీ పంచ భూతాలకి ఎంత శక్తీ ఉందో 'కళ' కి అంతే శక్తీ ఉంది. ఈ కళ నుంచి సినిమా(cinema)రూపంలో వచ్చే మాట, పాట, నటన, నటుడు, దృశ్యం అనేవి మనిషి నరనరనరాల్లో చాలా భద్రంగా ఉండిపోతాయి. ఆ ఐదింటి ద్వారా తమకి బాగా దగ్గరయ్యే  నటుడ్ని అయితే సూపర్ హీరోగా  చేసి తమ గుండెల్లో దైవశక్తిగా భద్రంగా కొలుచుకుంటూ ఉంటారు. ఇళయ దళపతి విజయ్ అప్ కమింగ్ మూవీ జననాయగన్(Jana Nayagan)రేపు ప్రీమియర్స్ నుంచే అడుగుపెడుతుండటంతో సినిమా గొప్ప తనం గురించి మరో సారి సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతుంది. మరి ఆ చర్చల వెనక ఉన్న పూర్తి విషయం ఏంటో చూద్దాం.