English | Telugu

అందుకే బాహుబలి విడియో లీక్ చేశా: వర్మ

బాహుబలి సినిమా దర్శకుడు రాజమౌళి పిర్యాదుపై తక్షణమే స్పందించిన హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు ముక్తా వి.యఫ్.యక్స్. అనే హైదరాబాద్ గ్రాఫిక్ సంస్థకు చెందిన వర్మ అనే ఉద్యోగి ఆ పని చేసినట్లు గుర్తించి అరెస్ట్ చేసారు. పోలీసుల విచారణలో అతను చెప్పిన సమాధానం దిగ్బ్రాంతి కలిగించింది. తమ సంస్థకు ఈ బాహుబలి ప్రాజెక్టు వచ్చిన తరువాత దానిపై పనిచేస్తున్న తనను తమ సంస్థ యాజమాన్యం చాలా వేధించిందని అందుకే ప్రతీకార చర్యగా ఈ పని చేసానని అతను ఒప్పుకొన్నాడు. దాదాపు 13నిమిషాల నిడివి గల ఆ వీడియో క్లిప్పింగ్ ను ముందుగా తన ల్యాప్ టాప్ లో కాపీ చేసుకొని బయటకు తీసుకు వచ్చి దానిని తన మిత్రులు కొందరితో వాట్స్ అప్ మరియు ఫేస్ బుక్ ద్వారా షేర్ చేసుకొన్నానని, తరువాత దానిని వారిలో ఎవరో ఒకరు ఇంటర్ నెట్ లోకి అప్ లోడ్ చేసి ఉండవచ్చని చెప్పాడు.

పోలీసులు అతనిపై కాపీరైట్ యాక్ట్ సెక్షన్ 46, 420, 63 కింద కేసు నమోదు చేసి, తప్పించుకొని తిరుగుతున్న అతని స్నేహితుల కోసం వెతుకుతున్నారు. సైబర్ క్రైం పోలీసులు ఇంటర్ నెట్ నుండి బాహుబలి సినిమా క్లిప్పింగులు పూర్తిగా తొలగించారు. కానీ ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా దానిని చాలా మంది డవున్ లోడ్ చేసుకొని తమ సన్నిహితులతో షేర్ చేసుకొనే ఉంటారు కనుక దాని వ్యాప్తిని అరికట్టడం అసాధ్యమనే భావించక తప్పదు. కానీ ఒక విధంగా అదే ఆ చిత్రానికి మంచి ప్రచారం కల్పించి సినిమా విజయానికి దోహదం చేసినా ఆశ్చర్యం లేదు.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.