English | Telugu

'సీతారామం' సీక్వెల్ కి కథ ఇచ్చిన రాఘవేంద్రరావు!

దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందిన సినిమా 'సీతారామం'. వైజయంతి మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా నిర్మించిన ఈ చిత్రం గతేడాది ఆగస్టులో విడుదలై ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొని క్లాసిక్ హిట్ గా నిలిచింది. సినీ ప్రముఖులు సైతం ఈ సినిమా చూసి ఫిదా అయ్యారు. వారిలో దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు ఒకరు. అయితే తాజాగా ఆయన 'సీతారామం' సీక్వెల్ చేస్తే బాగుంటుందని చెప్పడమే కాకుండా.. మీడియా సాక్షిగా నిర్మాత స్వప్న దత్ కి స్టోరీ లైన్ చెప్పి ఆశ్చర్యపరిచారు.

సంతోష్ శోభన్, మాళవిక నాయర్ జంటగా నందిని రెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న 'అన్నీ మంచి శకునములే' సినిమా మే 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా కూడా స్వప్న సినిమా బ్యానర్ లోనే రూపొందుతోంది. ఈ చిత్రం నుంచి తాజాగా 'చెయ్యి చెయ్యి కలిపేద్దాం' అనే సాంగ్ ని రిలీజ్ చేశారు. ఈ సాంగ్ లాంచ్ కార్యక్రమానికి హాజరైన రాఘవేంద్రరావు మాట్లాడుతూ.. సీతారామం సీక్వెల్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. స్వప్న దత్ తో ఆయన మాట్లాడుతూ.. "స్వప్న సినిమాలో వచ్చిన 'సీతారామం'ను మర్చిపోలేను. దాని తర్వాత వస్తున్న 'అన్నీ మంచి శకునములే' మంచి విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాను. సీతారామం విషయంలో ఒకటే బాధ నాకు.. ఆ సీత ఏమైంది?. సీత జీవితం అలా నాశనం చేయడం నాకు బాధగా ఉంది. నేనొక ఐడియా చెప్తాను.. మీ డైరెక్టర్ కి చెప్పు. సీత బాగా బాధపడి, ఒక గన్ తీసుకొని విలన్ దగ్గరకు వెళ్లి కాల్చబోతే.. అతను భయంతో ఒక గుహలోకి తీసుకెళ్లి రామ్ బతికే ఉన్నాడని చూపిస్తాడు. అక్కడి నుంచి సీత, రామ్ తప్పించుకోగా.. మళ్ళీ వాళ్ళని ఫ్యామిలీ విలన్స్ ఎలా ఛేజ్ చేశారని చూపించాలి. పాపం ఆ అమ్మాయిని అలాగే ఉంచొద్దు. ఇప్పుడు తలచుకున్నా కూడా నాకు కళ్ళ వెంట నీళ్లొస్తాయి" అన్నారు. రాఘవేంద్రరావు చెప్పిన ఐడియాకి ఓకే చెప్పిన స్వప్న.. "అలాగే జగదేకవీరుడు అతిలోకసుందరి సీక్వెల్ గురించి కూడా ఆలోచించండి" అని అడిగింది. దీంతో రాఘవేంద్రరావు "ఆ సీక్వెల్ ని నాగ్ అశ్విన్ తో చేయించండి" అని సలహా ఇచ్చారు. మరి ఈ రెండు సినిమాల సీక్వెల్స్ కార్యరూపం దాల్చుతాయో లేదో చూడాలి.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .