English | Telugu
రేసుగుర్రం ఆడియో లీకయ్యిందోచ్
Updated : Mar 13, 2014
ఈ మధ్య సినిమా విడుదలకు ముందే పైరసీ అవుతున్నాయి. అయితే తాజాగా "రేసుగుర్రం" పాటలు కూడా లీక్ అయ్యాయి. అల్లు అర్జున్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న "రేసుగుర్రం" చిత్ర ఆడియో విడుదల కార్యక్రమాన్ని మార్చి 16న విడుదల చేయడానికి సన్నాహాలు చేసారు. కానీ అంతకుముందే ఈ సినిమాలోని అన్ని పాటలు ఇంటర్నెట్ లో లీక్ అయ్యాయి. తమన్ సంగీతం అందించాడు. ఇదిలా ఉంటే తమిళంలో శింబు నటిస్తున్న "వాలు" చిత్రంలోని పాటలు కూడా ఇలాగే లీక్ అయ్యాయి. ఈ రెండు చిత్రాలకు తమన్ సంగీతం అందిస్తున్నాడు. అయితే ఈ ఆడియోను ఎవరు లీక్ చేసారో తెలియదు. ఈ చిత్ర యూనిటే కావాలని ఇలా మార్కెట్లోకి విడుదల చేసిందో లేక ఎవరైనా లీక్ చేసారా అనే విషయం మరికొద్ది క్షణాల్లో తెలియనుంది. లక్ష్మీనరసింహ ప్రొడక్షన్స్ బ్యానర్లో నల్లమలుపు బుజ్జి, కె.వెంకటేశ్వర రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందించిన పాటలు లహరి మ్యూజిక్ ద్వారా విడుదల కాబోతున్నాయి. ఈ చిత్రంలో శృతిహాసన్, సలోని కథానాయికలు.