English | Telugu

రేసుగుర్రం ఆడియో రివ్యూ

అల్లు అర్జున్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం "రేసుగుర్రం". లక్ష్మీనరసింహ ప్రొడక్షన్స్ బ్యానర్లో నల్లమలుపు బుజ్జి, కె.వెంకటేశ్వర రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందించిన పాటలు లహరి మ్యూజిక్ ద్వారా విడుదల కాబోతున్నాయి. ఈ చిత్రంలో శృతిహాసన్, సలోని కథానాయికలు. ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమాన్ని మార్చి 16న విడుదల చేయడానికి సన్నాహాలు చేసారు. కానీ అంతకుముందే ఈ సినిమాలోని అన్ని పాటలు ఇంటర్నెట్ లో లీక్ అయ్యాయి. తమన్ సంగీతం అందించాడు. మరి ఈ రేసు పాటలు ఎలా ఉన్నాయో చూద్దామా...!

1. బూచాడే బూచాడే

సింగర్స్: శ్రేయ ఘోషల్, రాహుల్ నంబియర్, నవీన్ మదన్. రచన: చంద్రబోస్

ఇందులో అల్లు అర్జున్ ఎలాంటి వాడో, అతను తలుచుకుంటే ఎలాంటి పనులు చేస్తాడు అనే విషయాలను ఈ పాట ద్వారా తెలిపారు.

2. స్వీటీ

సింగర్స్ : సిద్ధార్థ్ మహదేవన్, రబ్బిత్ మాక్. రచన:వరికుప్పల యాదగిరి

అమ్మాయిలోని స్టైల్ ను, పద్ధతులను మార్చడానికి హీరో పాడే పాట ఇది. జీవితంతో ఎలా పోరాడాలి అనే విషయాన్ని సింపుల్ గా, స్టైలిష్ మ్యూజిక్ తో పాట కొనసాగుతుంది.

3. సినిమా చూపిస్తా మావా

సింగర్స్ : సింహ, వరికుప్పల యాదగిరి. రచన: వరికుప్పల యాదగిరి

ఫుల్ మాస్ మసాలా పాట ఇది. పిల్లను చూడకుండా ఉండలేను అంటూ పిల్ల అందం గురించి పాడే పాట ఇది. ఎక్కువ తీన్ మార్ రేంజులో కొనసాగుతుంది. మాస్ ప్రేక్షకులకు ఈ మామ పాట బాగా నచ్చుతుంది.

4. గల గల

సింగర్స్ : దినేష్ కనగరత్నం, మేఘ. రచన:రెహమాన్

హీరోయిన్ వెనుక పడుతూ హీరో తన ప్రేమను తెలియజేసే పాట ఇది. వెస్ట్రన్ స్టైల్ లో పాటను కంపోస్ చేసాడు తమన్.

5. డౌన్ డౌన్

సింగర్స్ : తమన్, శృతిహసన్. రచన: విశ్వ

ఈ పాట మొత్తం పబ్బుల్లో ఎంజాయ్ చేసే పాట మాదిరిగా ఉంటుంది. ఎక్కువగా DJ స్టైల్లో ఉంటుంది. కాలం గురించి పట్టించుకోకుండా ఎంజాయ్ చేద్దాం అనే విధంగా ఈ పాట కొనసాగుతుంది.

6. రేసు గుర్రం

సింగర్స్ : ఉషా ఊతుప్, ఎంఎం.మానసి, ఎంఎం.మనీషా. రచన : వరికుప్పల యాదగిరి

ఇది టైటిల్ సాంగ్ అని చెప్పుకోవచ్చు. అసలు ఈ సినిమా ఎలా ఉండబోతుంది, ఇందులో హీరో పాత్ర ఎలా ఉండబోతుందో ఒక స్టైలిష్ మాస్ స్టైల్లో తమన్ కంపోస్ చేసాడు. ఉషా ఊతుప్ అదిరిపోయే రేంజులో పాడి అదరగొట్టింది.

చివరగా: తమన్ ఈసారి ఒక్క రెండు పాటల్లో మాత్రమే తన డప్పులను వాడినట్లుగా అనిపిస్తుంది. అయితే ఈ పాటలన్ని ఎక్కువగా స్టైలిష్ గా ఉన్నాయి. ఎదో వెస్ట్రన్ కల్చర్ అలవాటు అయిన వారికీ ఈ పాటలు వెంటనే నచ్చుతాయి. కానీ తెలుగు జనాలకు అంతగా త్వరగా నచ్చేలా కనపడట్లేదు.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.