English | Telugu

'రభస' కలేక్షన్లు నిరసించాయి..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ 'రభస' కలేక్షన్లు రోజురోజుకి నిరసించిపోతున్నాయి. ఎన్టీఆర్ కలలుకంటున్న 50 కోట్ల కలెక్షన్లు ఈ సినిమాతో సాధ్యంకాదని ట్రేడ్ వర్గాలు ఫిక్సయిపోయాయి. ప్రస్తుతం ఈ సినిమాని సేఫ్ జోన్ లో తీసుకురావడానికి నిర్మాతలు ప్రయత్నాలు మొదలుపెట్టారు. తొలి షో నుంచే నెగిటివ్ టాక్ మూటగట్టుకున్న 'రభస'..తొలిరోజు వసూళ్ళు బాగానే వచ్చినప్పటికీ ఆతరువాత వసూళ్ళు బాగా తగ్గిపోయాయి. ఇప్పుడు రవితేజ పవర్ వాయిదా పడడంతో 'రభస’ సేఫ్ జోన్ లోకి వస్తుందెమోనని బయ్యర్లు ఊపిరిపీల్చుకుంటున్నారు. మరి రభస 30 కోట్ల మార్క్‌ని అందుకుంటుందేమో చూడాలి.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.