English | Telugu

ఆది సినిమాతో మనోజ్ హ్యాపీ

ఆది, శాన్వి జంటగా నటిస్తున్న తాజా చిత్రం "ప్యార్ మే పడిపోయానే". రవి చావలి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కె.కె.రాధామోహన్ నిర్మాత. ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం ఇటీవలే హైదరాబాదులో జరిగింది. తొలి సిడీని మంచు మనోజ్ ఆవిష్కరించారు. సాయికుమార్ స్వీకరించారు. ఈ సందర్భంగా మనోజ్ మాట్లాడుతూ... "నా పాట ఈ సినిమాకు టైటిల్ అవడం ఎంతో ఆనందాన్నిచ్చింది. ఇందులో ఆది నటిస్తున్నాడని తెలిసి ఇంకా ఆనందం కలిగింది. ఆది డాన్స్, అనూప్ పాటలు చాలా బాగున్నాయి" అని అన్నారు. ఆది మాట్లాడుతూ..."ప్రేమకథలకు సంగీతమే ప్రాణం. ఈ సినిమా ఫలితంలో సగభాగం అనూప్ రూబెన్స్ కే చెందుతుంది. నిర్మాత రాధామోహన్ ఎక్కడ రాజీపడకుండా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాడు. ఇది అందరికి నచ్చుతుంది" అని అన్నారు. ఈ కార్యక్రమానికి నాని, కె.అచ్చిరెడ్డి, సందీప్ కిషన్, చైతన్య కృష్ణ, నవదీప్, రకూల్ ప్రీత్ సింగ్. ఎరికా ఫెర్నాండేజ్ లతో పాటు తదితరులు పాల్గొన్నారు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.