English | Telugu

పద్మశ్రీ పై మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు

నటుడు మోహన్ బాబు యముడిగా నటిస్తున్న తాజా చిత్రం "యమలీల2". ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్ విడుదల కార్యక్రమం మంగళవారం రాత్రి హైదరాబాదులో జరిగింది. ఈ కార్యక్రమంలో మోహన్ బాబు తన పద్మశ్రీపై ఘాటుగా స్పందించాడు. ఈ కార్యక్రమంలో మోహన్ బాబుని వేదికపై పిలుస్తూ.."పద్మశ్రీ మోహన్ బాబు" అని పిలవడంతో మోహన్ బాబు అసంతృప్తి చెంది సమాధానంగా... "పద్మశ్రీ ని మోహన్ బాబు తీసుకొచ్చాడు. అంతేకానీ మోహన్ బాబుని పద్మశ్రీ తీసుకురాలేదు. మోహన్ బాబు మంచి నటుడు అని అనుకుంటే చాలు. ఈ బిరుదులు పెద్ద విషయం కాదు. అయినా ఇది అప్రస్తుతం. కేసు కోర్టులో ఉంది వదిలేయండి" అంటూ అన్నారు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.