బెనిఫిట్ షో కి దారేది
on Jan 3, 2026

-మరికొన్నిరోజుల్లో సెల్యులాయిడ్ పైకి ప్రభాస్, చిరంజీవి
-తెలంగాణాలో బెనిఫిట్ షో కి సంబంధించి అభిమానుల్లో టెన్షన్ వాతావరణం
-అఖండ 2 విషయంలో మంత్రి కోమటిరెడ్డి ఏమన్నారు!
-ఇప్పడు కూడా అదే మాటపై ఉంటాడా!
-రేవంత్ రెడ్డి దగ్గరకి బెనిఫిట్ షో పంచాయితీ వెళ్తుందా!
-ఫ్యాన్స్ ఏమంటున్నారు
బెనిఫిట్ షో.. ఈ పదాన్ని డై హార్ట్ ఫ్యాన్స్ ప్రేమించినంత ఇదిగా మరొకరు ప్రేమించరు. అదే టైంలో బెనిఫిట్ షో ప్రదర్శించకపోతే నిరసన చెయ్యడానికి కూడా వెనకాడరు. అంతలా డై హార్ట్ ఫ్యాన్స్ కి,బెనిఫిట్ షో కి మధ్య అనుబంధం సుదీర్ఘ కాలం నుంచి కొనసాగుతూ వస్తుంది. బడా హీరోలకి, డై హార్ట్ ఫ్యాన్స్ కి మధ్య వారధి కూడా. హీరోలు సైతం ఫ్యాన్స్ ఆకాంక్ష మేరకు తమ చిత్రం బెనిఫిట్ షో తో ప్రారంభం కావాలని కోరుకుంటారు. భారీ బడ్జెట్ తో నిర్మాణం జరుగుతుంది కాబట్టి బెనిఫిట్ షో కి వచ్చే అమౌంట్ తమకి ఉపయోగపడుతుందనేది మేకర్స్ కూడా ఆశ పడుతుంటారు. ప్రభుత్వాలు కూడా బెనిఫిట్ షో విషయంలో పాజిటివ్ గా స్పందించడం ఆనవాయితీ. కానీ ఇప్పుడు బెనిఫిట్ షో పై తెలంగాణ ప్రభుత్వం తుది నిర్ణయం ఏ విధంగా ఉండబోతోందనే చర్చ సోషల్ మీడియా వేదికగా జరుగుతుంది.
సంక్రాంతికి చిరంజీవి 'మన శివశంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasadgaru)తో 'రాజాసాబ్' (The Raja Saab)తో ప్రభాస్ ది యేటర్స్ లో అడుగుపెడుతున్నారు. ఈ రెండు చిత్రాలని ప్రేక్షకులు, మూవీ లవర్స్ కంటే ముందే చూడాలని బెనిఫిట్ షో కోసం ఫ్యాన్స్ ఎంతో ఎగ్జైట్ మెంట్ తో ఎదురుచూస్తుంటారు. కానీ అఖండ 2 రిలీజ్ టైం లో తెలంగాణ సినిమోటోగ్రఫీ మినిష్టర్ కోమటి రెడ్డి వెంకట రెడ్డి మాట్లాడుతు ప్రభుత్వానికి తెలియకుండా అధికారులు అఖండ 2 టికెట్ రేట్స్ పెంపుకి అనుమతి ఇచ్చారు. దీంతో ఇక టికెట్ రేట్స్ పెంపుకోసం, బెనిఫిట్ షో అనుమతి కోసం సినిమా వాళ్ళు ఎవరు రావద్దని ఖరాఖండిగా చెప్పాడు. ఈ నేపథ్యంలో ఇప్పుడు తెలంగాణ కి సంబంధించి బెనిఫిట్ షో విషయంలోనే కాకుండా టికెట్ రేట్స్ పెంపుపై కూడా ఆసక్తి నెలకొని ఉంది.
Also read: రజనీ, కమల్ ప్రాజెక్ట్ కి ఊహించని దర్శకుడు.. కన్ఫార్మ్ చేసిన కమల్ హాసన్
సోషల్ మీడియాలో ఈ విషయంపై ఇద్దరి అభిమానులు స్పందిస్తు 'చిరంజీవి గారు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం నిర్వహించే కొన్ని కార్యక్రమాలకి ముఖ్య అతిధిగా హాజరవుతూ వస్తున్నారు. పైగా రేవంత్ రెడ్డి తో కోమటి రెడ్డి తో వ్యక్తిగతంగా కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. దీంతో బెనిఫిట్ షో విషయంతో పాటు టికెట్ రేట్స్ పెంపు విషయంలో రాజా సాబ్, మన శంకర వర ప్రసాద్ కి ప్రభుత్వం నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందని అంటున్నారు.మరి వాళ్ళ నమ్మకం నిలబడుతుందో లేదో చూడాలి. ఇక సంక్రాంతికే వస్తున్న భర్త మహాశయులకు విజ్ఞప్తి, అనగనగ ఒక రాజు చిత్రాల మేకర్స్ మాట్లాడుతు తమ సినిమాలకి టికెట్ రేట్స్ పెంపు ఉండవని అధికారకంగా చెప్పిన విషయం తెలిసిందే.సంక్రాంతికే వస్తున్న నారి నారి నడుమ మురారి కూడా ఇదే దారిలో పయనించే అవకాశం ఉంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



