English | Telugu
ఆగస్టు 12న "చండీ" ఆడియో
Updated : Jul 31, 2013
ప్రియమణి ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం "చండీ". యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్ర ఆడియోను ఆగస్టు 12న విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి ఎస్.ఆర్. శంకర్, చిన్నా సంగీతాన్ని అందించారు. సముద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రెబల్ స్టార్ కృష్ణంరాజు, శరత్ కుమార్ లు ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. శ్రీను బాబు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని త్వరలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.