English | Telugu
పవన్ మరదలు ఒకేసారి పెంచేసింది
Updated : Feb 25, 2014
"అత్తారింటికి దారేది" సినిమాలో పవన్ మరదలుగా నటించి సినిమా విజయంలో ఓ కీలక పాత్ర వహించింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టవడంతో ఈ అమ్మడికి చాలా ఆఫర్లు వస్తున్నాయి. ఇటీవలే కన్నడలో ఉపేంద్రతో కలిసి చేసిన "బ్రహ్మ" సినిమా విజయం సాధించడంతో ఈ అమ్మడు తన రెమ్యునరేషన్ ను కోటికి పెంచేసింది. ఇటీవలే ఓ తెలుగు నిర్మాత ఈ అమ్మడిని తమ సినిమాలో నటించాలని ఆఫర్ ఇస్తే... కోటి రూపాయలు ఇస్తే చేస్తాను లేకుంటే చేయనని చెప్పేసిందట. దీంతో ఖంగుతిన్న నిర్మాత వెనక్కి వచ్చేసాడట. ఒకేసారి అటు కన్నడలో, ఇటు తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్స్ రావడంతో ఈ అమ్మడు ఇలా పెంచేసి... ఓ నాలుగు కోట్లు వెనకేసుకుందామని భావిస్తోంది. ప్రస్తుతం ఎన్టీఆర్ తో కలిసి "రభస" సినిమాలో నటిస్తుంది. మరి ఈ సినిమా హిట్టయితే ఈ అమ్మడిని ఆపడం కష్టమే అవుతుంది.