English | Telugu

ముగ్గురు హీరోయిన్లతో చిందేస్తున్న ప్రభాస్ 

ఆఫ్టర్ బాహుబలి తర్వాత ప్రభాస్ ఒక కమర్షియల్ సినిమాని చెయ్యాలని కొన్ని లక్షల మంది అభిమానులు కోరుకున్నారు. వాళ్ళ అభ్యర్ధనని మన్నించిన డార్లింగ్ రాజా సాబ్ చేస్తున్నాడు. అందులో నుంచి ప్రభాస్ లుక్ బయటకి వచ్చినప్పటినుంచి ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. ఊర మాస్ యాక్టింగ్ కి నేను రెడీ అనేలా లుంగీ కట్టుకొని ఉన్న ప్రభాస్ స్టిల్ ఫ్యాన్స్ కి విపరీతంగా నచ్చింది. ఇక లేటెస్ట్ న్యూస్ ఒకటి వాళ్ళల్లో మరింత ఉత్సాహాన్ని పెంచుతుంది.

రాజా సాబ్ పక్కా మాస్ మూవీ. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ లు ప్రభాస్ తో జత కడుతున్నారు.పైగా ముగ్గురు హీరోయిన్లతో ప్రభాస్ జత కట్టడం ఇదే తొలిసారి. ఇప్పుడు ఆ ముగ్గురుతో కలిసి ప్రభాస్ ఒక సూపర్ మాస్ సాంగ్ కి స్టెప్ లు వెయ్యబోతున్నాడు. త్వరలోనే షూట్ కి వెళ్లబోతున్నాడు. పైగా మూవీ మొత్తానికి ఆ సాంగ్ హైలైట్ కానుందనే వార్తలు వస్తున్నాయి. అలాగే ప్రభాస్ మాస్ డ్యాన్స్ సరికొత్తగా ఉండబోతుందని రేపు థియేటర్స్ లో విజిల్స్ మోగడం గ్యారంటీ అని అంటున్నారు

ఇక డైరెక్టర్ మారుతీ తనకి వచ్చిన అవకాశాన్ని నిరూపించుకొని పాన్ ఇండియా లెవల్లో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలనే పట్టుదలతో ఉన్నాడు. ఫస్ట్ టైం ప్రభాస్ లాంటి బిగ్ స్టార్ ని డైరెక్క్షన్ చేస్తుండటంతో అవుట్ ఫుట్ కోసం రేయింపగళ్ళు శ్రమిస్తున్నాడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పై టి జి విశ్వ ప్రసాద్ అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తుండగా థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. బాలీవుడ్ అగ్ర నటుడు సంజయ్ దత్ కీలక పాత్ర చేస్తున్నట్లు తెలుస్తోంది.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.