English | Telugu

అమృత పాండే ఆత్మహత్య లో షాకింగ్ న్యూస్..ఫ్యామిలీ విచారణ 

అమృత పాండే.. భోజ్ పురి సినీ రంగంలో మంచి నటిగా గుర్తింపుని తెచ్చుకుంది. పైగా తనకి ఎంతో భవిష్యత్తు కూడా ఉంది. ఈ క్రమంలో బీహార్ భాగల్పూర్ లోని తన ప్లాట్ లో ఉరి వేసుకొని చనిపోయింది. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు దర్యాప్తుని ప్రారంభించారు. ఈ క్రమంలో కొన్ని సంచలన విషయాలు బయటకి వచ్చాయి

అమృత పాండే కి యానిమేషన్ రంగానికి చెందిన చంద్ర మణి ఝంగాడ్ తో వివాహం జరిగింది. ఇద్దరు కలిసి ముంబై లో నివాసం ఉంటున్నారు. ఏప్రిల్ 12 న తన సోదరి వివాహానికి హాజరయ్యేందుకు అమృత బీహార్ వచ్చింది.ఆ సమయంలో చంద్ర మణి కూడా ఆమె వెంట ఉన్నాడు. వివాహం అనంతరం అతను ముంబై కి తిరిగి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అమృత భాగల్పూర్ లో ఒక పార్టీ నిర్వహించింది. చంద్ర మణి కూడా హాజరయ్యాడు. పైగా ఇద్దరు కలిసి ఎంతో సంతోషంతో డాన్స్ కూడా చేసారు. కలిసే డిన్నర్ చేసారు. ఆ సమయంలో అమృతలో ఎలాంటి మానసిక ఒత్తిడి లేదు.అది జరిగిన రెండు రోజులకి అంటే ఏప్రిల్ 27 న సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేసింది. అతని జీవితం రెండు పడవలపై ఉంది.కాబట్టి అతని జీవితాన్ని సులభతరం చెయ్యడానికి మేము మా పడవని ముంచుతున్నాం అని పోస్ట్ చేసింది . ఆ తర్వాతే సూసైడ్ చేసుకుంది.

తాజాగా పోలీసుల నివేదికలో ఇంకో విషయం వెలుగులోకి వచ్చింది. అమృతకి తన ఇద్దరు సోదరీమణులు , దత్తత తీసుకున్న తమ్ముడుతో ఒక సమస్యపై గొడవ ఉందని తెలుస్తుంది.పైగా తన సోదరి కుమార్తెను కూడా పెంచుతుంది .ఈ కోణంలో కూడా విచారణ జరుగుతుంది. మరి ముందు ముందు ఈ కేసులో ఎలాంటి సంచలన విషయాలు బయటకి వస్తాయో చూడాలి. భోజ్‌పురి సూపర్ స్టార్ ఖేసరి లాల్ యాదవ్‌తో కలిసి దీవానాపన్ అనే మూవీలో నటించింది. అలాగే పలు హిందీ సినిమాలు,టీవీ షోలు మరియు వెబ్ సిరీస్‌లలో కూడా నటించింది. పరిషోద్ అనే వెబ్ సిరీస్‌ ఆమెకి మంచి పేరు తీసుకొచ్చింది

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .