English | Telugu

ఫ్యాన్స్ కోసం డార్లింగ్ షాకింగ్ డెసిషన్!?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మంచి నటుడు మాత్రమే కాదు.. మంచి డ్యాన్సర్ కూడా. పలు చిత్రాల్లో తన చిందులతో అభిమానులకు కనువిందు చేశారాయన. అలాంటి ప్రభాస్.. గత కొంతకాలంగా డ్యాన్స్ లకు దూరంగా ఉంటున్నారు. మరీముఖ్యంగా.. 'బాహుబలి' నుంచి ప్రభాస్ సినిమాల్లో సరైన డ్యాన్స్ మూమెంట్స్ ఉండడం లేదు.

అయితే దీని వెనుక ఒక బలమైన కారణం ఉందట. 'బాహుబలి' టైమ్ లో చేసిన రోప్ ఫైట్ల వల్ల తనకి మోకాలు సమస్య వచ్చింది. దీంతో.. కొంతకాలంగా మందులు, ఇంజెక్షన్స్ తో నెట్టుకొస్తున్నారు డార్లింగ్. అంతేకాదు.. మూడు నెలలకో, ఆరు నెలలకో విదేశాలకు వెళ్ళి తాత్కాలిక చికిత్స చేయించుకుని వస్తున్నారు. ఈ కారణంగానే.. పాటల్లో డ్యాన్స్ చేయడం తగ్గించేశారు ప్రభాస్. త్వరలోనే సర్జరీ తో ఈ సమస్యకు శాశ్వతంగా చెక్ పెట్టేందుకు డార్లింగ్ ప్లాన్ చేసుకుంటున్నారు. 'సలార్', 'కల్కి 2898 ఎడి' పనులు పూర్తి కాగానే సర్జరీ చేయించుకుని, మూడు నెలల పాటు బాగా విశ్రాంతి తీసుకోవాలని భావిస్తున్నారట డార్లింగ్.

అలాగే.. 'సలార్', 'కల్కి' తరువాత వచ్చే మారుతి సినిమాలో ఒకట్రెండు పాటల్లో తన నృత్యాలతో ఎంటర్టైన్ చేసే దిశగానూ ప్రభాస్ స్కెచ్ వేస్తున్నారట. ఏదేమైనా.. ప్రభాస్ నిర్ణయం ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చే అంశమే.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.