English | Telugu
ఆ రెండింటికి మాత్రమే సామ్ గ్రీన్ సిగ్నల్
Updated : Aug 12, 2023
స్టార్ హీరోయిన్ సమంత ఇప్పుడు సినిమాల నుంచి కాస్త బ్రేక్ తీసుకుంది. ప్రస్తుతం ఆమె ఆధ్యాత్మికతో పాటు తన ఆరోగ్యంపై ఫోకస్ చేసింది. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన విషయాలను తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా వీడియోస్, ఫొటోస్ ద్వారా రివీల్ చేస్తూనే ఉందీ చెన్నై సొగసరి. తాజాగా సమంత తన లేటెస్ట్ లుక్‌ను పోస్ట్ చేసింది. ఆ లుక్‌ను చూసిన వారందరూ షాక్ అవుతున్నారు. అసలు సామ్ ఎందుకిలా తన లుక్‌ని మార్చేసిందో అర్థం కాలేదు. సమంత సన్నబడుతోంది. అయితే హెల్త్ కోసమే సమంత అలా చేస్తుందంటూ కొందరు అంటున్నారు.
మరో వైపు సమంత హీరోయిన్‌గా నటించిన ఖుషి సినిమా సెప్టెంబర్ 1న రిలీజ్ అవుతుంది. మరో వైపు ఫ్యామిలీ మేన్ సిరీస్ తర్వాత సామ్ చేసిన వెబ్ సిరీస్ సిటాడెల్ ప్రేక్షకులను మెప్పించటానికి సిద్ధమవుతోంది. ముందుగా మాత్రం విజయ్ దేవరకొండతో సమంత జోడీ కట్టిన ఖుషి థియేటర్స్‌లో సందడి చేయనుంది. మరిప్పుడు పూర్తి రెస్ట్‌లో ఉన్న సమంత ఖుషి ప్రమోషన్స్‌కు వస్తుందా? రాదా? అని అందరూ ఆలోచనలో పడ్డారు. అయితే తాజాగావినిపిస్తోన్నసమచారం మేరకు ఖుషి సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొంటానని సమంత చెప్పేసింది.
అయితే సమంత పెట్టిన కండీషన్ మాత్రం నిర్మాతలకు ఓ రకంగా షాకిచ్చింది. అదేంటంటే.. ఓ కామన్ ఇంటర్వ్యూతో పాటు ఓ మ్యూజికల్ నైట్ ఈవెంట్ (ప్రీ రిలీజ్)కు మాత్రమే వస్తానని సామ్ చెప్పేసిందట. ఇక సరేననటం నిర్మాతలవంతైంది. మజిలీ తర్వాత శివ నిర్వాణ డైరెక్షన్‌లో సమంత చేసిన సినిమా ఇది. ఇప్పుడు శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై యలమంచిలి రవిశంకర్, నవీన్ ఎర్నేని ఈ సినిమాను నిర్మించారు.