English | Telugu

'దేవర' వర్సెస్ 'సలార్'.. బిగ్గెస్ట్ బాక్సాఫీస్ వార్!

ఈ సెప్టెంబర్ 28న విడుదల కావాల్సిన 'సలార్ పార్ట్ -1' వాయిదా పడిన సంగతి తెలిసిందే. మొదట ఈ సినిమా ఈ ఏడాది నవంబర్ లేదా డిసెంబర్ లో విడులయ్యే అవకాశముంది అన్నారు. ఆ తర్వాత వచ్చే ఏడాది సంక్రాంతి అన్నారు. ఇప్పుడేమో వచ్చే ఏడాది వేసవిలో అంటున్నారు. అదే నిజమైతే వచ్చే సమ్మర్ కి బిగ్గెస్ట్ బాక్సాఫీస్ వార్ చూడబోతున్నాం.

'సలార్'ని 2024, మార్చి చివరిలో లేదా ఏప్రిల్ లో విడుదల చేయాలని చూస్తున్నారట. అయితే ఇప్పటికే ఏప్రిల్ 5 తేదీపై 'దేవర' టీం కర్చీఫ్ వేసింది. నవంబర్ కల్లా షూటింగ్ పూర్తి చేసి, ఏప్రిల్ 5 కే విడుదల చేసేలా పక్కా ప్లానింగ్ తో దేవర టీం వెళ్తోంది. అయితే ఇప్పుడు సలార్ టీం కూడా అదే టైంకి రావాలని చూస్తోందట. అదే జరిగితే అసలుసిసలైన మాస్ బాక్సాఫీస్ పోరు చూడనున్నాం.

'ఆర్ఆర్ఆర్' తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా కావడంతో 'దేవర'పై భారీ అంచనాలు ఉన్నాయి. పైగా ఈ చిత్రం భారీ బడ్జెట్ తో బాలీవుడ్ స్టార్స్, హాలీవుడ్ టెక్నీషియన్స్ తో రూపొందుతోంది. ఇక 'బాహుబలి-2' తర్వాత ప్రభాస్ వరుస ఫ్లాపుల్లో ఉన్నప్పటికీ.. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ తో చేస్తున్న సినిమా కావడంతో 'సలార్'పై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఈ సినిమా ఎప్పుడొచ్చినా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీ సృష్టించడం ఖాయమనే అంచనాలున్నాయి. అంతటి భారీ అంచనాలున్న 'దేవర', 'సలార్' సినిమాలు తలపెడితే ఆ పోరు ఎలా ఉంటుందో మాటల్లో వర్ణించలేము.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.