English | Telugu

ఫుల్ లెంగ్త్ కామెడీ రోల్ లో ప్రభాస్.. లుక్ ఇదే!

మారుతి దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ చిత్రం అధికారిక ప్రకటన రాకుండానే సైలెంట్ గా షూటింగ్ జరుపుకుంటోంది. అయితే 'బాహుబలి'తో పాన్ ఇండియా క్రేజ్ సొంతం చేసుకొని, వరుస భారీ బడ్జెట్ సినిమాలు చేస్తున్న ప్రభాస్.. ఎక్కువగా యంగ్ హీరోలతో కామెడీ ఫిల్మ్స్ చేసే మారుతితో సినిమా చేస్తుండటం అందరినీ ఆశ్చర్యపరిచింది. అదే సమయంలో ఇందులో ప్రభాస్ రోల్ ఎలా ఉంటుంది? లుక్ ఎలా ఉంటుంది? అని తెలుసుకోవాలనే ఆసక్తి నెలకొంది. అయితే తాజాగా ప్రభాస్ రోల్, లుక్ పై క్లారిటీ వచ్చేసింది.

ప్రభాస్ యాక్షన్ హీరో అయినప్పటికీ ఆయన కామెడీ టైమింగ్ ని ఇష్టపడేవారు ఎందరో ఉన్నారు. ముఖ్యంగా 'బుజ్జిగాడు', 'డార్లింగ్' వంటి సినిమాలలో ఆయన తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను ఫిదా చేశారు. ప్రభాస్ కామెడీ టైమింగ్ మిస్ అవుతున్నామని, మళ్ళీ ఆయన ఆ తరహా రోల్స్ చేస్తే బాగుంటుందని ఎందరో ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అయితే మారుతి సినిమాతో వారి కోరిక తీరనుంది.

ప్రభాస్-మారుతి సినిమాలో మహేష్ ఆచంట ఓ పాత్ర పోషిస్తున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మహేష్.. ప్రభాస్ మంచి మనసు గురించి, మారుతి సినిమాలో ఆయన పాత్ర గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. షూటింగ్ లో ఎంతమంది ఉంటే అంతమందికి ప్రభాస్ అన్న భోజనం తెప్పిస్తారని చెప్పాడు. చాలా రోజుల తర్వాత చెక్ షర్ట్స్ వేసుకొని ఓ మంచి కామెడీ రోల్ చేస్తున్నారని తెలిపాడు. అలాగే ఇందులో ప్రభాస్ అన్న లుక్.. అచ్చం 'అన్ స్టాపబుల్' షోలో పాల్గొన్నప్పటి లుక్ లాగా ఉంటుందని రివీల్ చేశాడు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.