English | Telugu

లిప్‌లాక్‌లతో రెచ్చిపోయిన ప్రభాస్‌ హీరోయిన్‌!

ఒకప్పుడు సినిమా హీరోయిన్లకు అందంతోపాటు అభినయం కూడా ఉండేది. శృతి మించని రొమాంటిక్‌ సీన్స్‌లోనూ నటించి మెప్పించేవారు. కానీ, ఇప్పటి జనరేషన్‌ హీరోయిన్లు ఆ హద్దును చెరిపేశారు. కథకు అవసరం అనుకుంటే ఎలాంటి సన్నివేశాల్లో నటించడానికైనా సై అంటున్నారు. భాషతో ప్రమేయం లేకుండా ఏ ఇండస్ట్రీలోనైనా హీరోయిన్లు ఇదే ఆలోచనతో ఉన్నారు. రష్మిక మందన్న వంటి హీరోయిన్లు ముద్దు సీన్లతోపాటు బెడ్‌ రూమ్‌ సీన్స్‌లో కూడా నటించి దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారు. తాజాగా ఆ లిస్ట్‌లో చేరిన మరో హీరోయిన్‌ మాళవిక మోహనన్‌. మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ‘రాజాసాబ్‌’ చిత్రంలో ప్రభాస్‌ సరసన నటిస్తోందీ మలయాళీ ముద్దుగుమ్మ.

మలయాళంలో రూపొందిన ‘పట్టంపోలే’ చిత్రంతో నటిగా ఎంట్రీ ఇచ్చింది మాళవిక. దాదాపు పదేళ్లుగా తమిళ్‌, మలయాళ, హిందీ, కన్నడ భాషా చిత్రాల్లో నటిస్తూ వస్తున్న మాళవిక డబ్బింగ్‌ సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఇప్పుడు రాజాసాబ్‌తో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తోంది. దీనితోపాటు హిందీలో సిద్ధాంత్‌ చతుర్వేది హీరోగా రూపొందిన ‘యుద్ర’ చిత్రంలో నటించింది. ఈ సినిమా సెప్టెంబర్‌ 20న విడుదల కాబోతోంది. పదేళ్ళ తన కెరీర్‌లో అప్పుడప్పుడు కాస్త ఎక్స్‌పోజింగ్‌ చేసినా ‘యుద్ర’ సినిమాలో మాత్రం పూర్తి స్థాయిలో తన అందాలను ఆరబోసేందుకు సిద్ధమైంది మాళవిక. ఇటీవల ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్‌ రిలీజ్‌ అయింది. ‘యానిమల్‌’ చిత్రం తరహాలో ఈ సినిమాలో కూడా లెక్కకు మించిన రొమాంటిక్‌ సన్నివేశాలు, లిప్‌లాక్‌లు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలోని మాళవిక స్టిల్స్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. మాళవిక అందాలు బాలీవుడ్‌ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటున్నాయి.

అంతకుముందు బియాండ్‌ ది క్లౌడ్స్‌ అనే హిందీ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా విడుదలై 6 సంవత్సరాలవుతోంది. ఈ సినిమా మాళవికకు అంతగా గుర్తింపు తెచ్చిపెట్టలేదు. ఇప్పుడు యుద్ర చిత్రంతో మరో అవకాశం వచ్చింది. దాన్ని సద్వినియోగం చేసుకోవడంలో పూర్తి ఎఫర్ట్‌ పెట్టింది. ఇప్పటివరకు ఆమె కెరీర్‌లో చేయని పాత్రను ఈ సినిమాలో చేసింది. అలాగే శృంగార సన్నివేశాల్లో లిమిట్స్‌ కూడా దాటేసింది. ఈ సినిమా సక్సెస్‌ అయితే హిందీలో మాళవికకు తిరుగుండదని బాలీవుడ్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రభాస్‌ లాంటి పాన్‌ ఇండియా హీరో నటిస్తున్న రాజా సాబ్‌ చిత్రంలో కూడా హీరోయిన్‌గా నటిస్తుండడంతో ఆమెకు బాలీవుడ్‌లో మంచి గ్రిప్‌ వచ్చే అవకాశం ఉంది. ఆరు సంవత్సరాల నిరీక్షణ తర్వాత బాలీవుడ్‌లో మళ్ళీ హీరోయిన్‌గా ఛాన్స్‌ దక్కించుకున్న మాళవిక దాన్ని సద్వినియోగం చేసుకునే పనిలో ఉంది. యుద్ర ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌లోనూ ఎక్స్‌పోజింగ్‌ విషయంలో ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటికే కొందరు బాలీవుడ్‌ హీరోల దృష్టిలోకి మాళవిక వచ్చిందని తెలుస్తోంది. యుద్ర తర్వాత ఆమెకు బాలీవుడ్‌లో వరస అవకాశాలు వస్తాయంటున్నారు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.