English | Telugu

ప్రభాస్ బర్త్ డే కి త్రిప్తి డిమ్రి అదిరిపోయే గిఫ్ట్! 

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(prabhas)అప్ కమింగ్ మూవీ రాజాసాబ్(raja saab)హర్రర్ కామెడీ గా తెరకెక్కుతున్నఈ మూవీలో చాలా ఏళ్ళ తర్వాత ప్రభాస్ వింటేజ్ లుక్ లో కనిపించనున్నాడు.అందుకు తగ్గట్టుగానే ఇప్పటికే రిలీజైన ప్రభాస్ లుక్ తో పాటు ఫస్ట్ గ్లింప్స్ అభిమానులతో పాటు ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.నిది అగర్వాల్,మాళవిక మోహన్ హీరోయిన్స్ గా చేస్తుండగా భలే భలే మగాడివోయ్,ప్రతిరోజు పండుగే సినిమాల ఫేమ్ మారుతీ(maruthi)దర్శకుడుగా చేస్తున్నాడు.పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టి జె విశ్వ ప్రసాద్(tj viswa prasad)అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తుండగా వచ్చే సంవత్సరం ఏప్రిల్ 10 న విడుదల కాబోతుంది.

ఇక రాజా సాబ్ లో ఒక ఐటెం సాంగ్ కి స్కోప్ ఉందనే విషయం అందరకి తెలిసిందే.ఈ మేరకు మేకర్స్ చాలా రోజుల క్రితమే వెల్లడి కూడా చేసారు.దీంతో ఐటెం సాంగ్ లో ఎవరు చేస్తారనే ఆసక్తి అందరిలో ఉంది.ఎందుకంటే ప్రభాస్ సినిమాల్లో ఐటెం సాంగ్స్ చాలా తక్కువ.యోగి, బాహుబలి లాంటి సినిమాల్లో తప్ప పెద్దగా ఐటెం సాంగ్స్ లేవు.దీంతో రాజా సాబ్ టీం ఐటెం సాంగ్ ని ఒక లెవల్లో ప్లాన్ చేస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి.పైగా ఇప్పుడు ప్రభాస్ పాన్ ఇండియా హీరో కాబట్టి ఆ కోణంలోనే నటిని ఎంపిక చెయ్యాలని చూస్తున్నారు.

అందులో భాగంగానే యానిమల్ ఫేమ్ త్రిప్తి డిమ్రి(tripti dimri)ని తమ ఐటెం సాంగ్ లో ఫిక్స్ చేయబోతున్నారని తెలుస్తుంది. ఈ మేరకు త్రిప్తి ని సంప్రదించారని, ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, దీని పై త్వరలోనే అధికార ప్రకటన కూడా రానుందని అంటున్నారు.ఇదే కనుక జరిగితే రాజాసాబ్ లోని ఐటెం సాంగ్ రేపు థియేటర్స్ లో సంచలనం సృష్టించడం పక్కా. ఇక ఈ రోజు ప్రభాస్ పుట్టిన రోజు కావడంతో అభిమానులతో పాటు పలువురు సినీ ప్రముఖులు ప్రభాస్ కి బర్త్ డే విషెస్ చెప్తున్నారు.


అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.