English | Telugu

ప్రభాస్‌ అంటే అందరికీ ఇష్టమే.. మరి అతని ఇష్టాలేమిటో తెలుసా?

ఉప్పలపాటి వెంకట సూర్యనారాయణ ప్రభాస్‌రాజు... ఈ పేరు చెబితే ఎవరూ గుర్తు పట్టకపోవచ్చు. కానీ, ప్రభాస్‌ అంటే తెలియని వారు ఇప్పుడు ప్రపంచంలోనే లేరంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే ‘బాహుబలి’ సిరీస్‌ నుంచి ‘కల్కి 2898ఎడి’ చిత్రం వరకు అతను చేసిన సినిమాలే దానికి కారణం. టాలీవుడ్‌లోనే కాదు, ఇండియాలో ఉన్న టాప్‌ హీరోలందరిలోనూ ప్రభాస్‌కి ఓ ప్రత్యేకమైన స్థానం ఉంది. తొలి సినిమా ‘ఈశ్వర్‌’ రిలీజ్‌ అయినపుడు ప్రభాస్‌ బిహేవియర్‌ ఎలా ఉందో.. ఇప్పుడు ‘కల్కి’ సినిమా రిలీజ్‌ అయిన తర్వాత కూడా అలాగే ఉంది. ఇండియాలోనే టాప్‌ హీరోగా వెలుగొందుతున్నప్పటికీ ఏమాత్రం గర్వం లేకుండా ఎంతో సింపుల్‌గా కనిపించడం, తొలిరోజుల్లో కనిపించిన చిరువ్వుతోనే అందర్నీ పలకరించడం ఆయనకు పుట్టుకతోనే అబ్బింది. రెబల్‌స్టార్‌ కృష్ణంరాజు నట వారసుడిగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్‌ అంచెలంచెలుగా ఎదుగుతూ ఇప్పుడు ప్రపంచస్థాయిలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. ప్రభాస్‌ అంటే అందరికీ ఇష్టమే. మరి ప్రభాస్‌కి ఇష్టమైనవి ఏమిటి, అతని అభిరుచులు ఏమిటి, ఖాళీ సమయాల్లో అతను ఏం చేస్తుంటాడు? అతని బాల్యానికి సంబంధించిన విశేషాలు ఏమిటి? అనేది డార్లింగ్‌ పుట్టినరోజు సందర్భంగా తెలుసుకుందాం.

ప్రభాస్‌కి ఇష్టమైన డైరెక్టర్‌ రాజ్‌కుమార్‌ హిరానీ. ఆయన డైరెక్షన్‌లో వచ్చిన ‘మున్నాభాయ్‌ ఎంబిబిఎస్‌’, ‘3 ఇడియట్స్‌’ చిత్రాలను లెక్కలేనన్ని సార్లు చూశారు. ప్రభాస్‌కి ఇష్టమైన కలర్స్‌.. బ్లాక్‌ అండ్‌ వైట్‌. ఏదైనా ఫంక్షన్‌కిగానీ, ఈవెంట్‌కి గానీ హాజరు కావాలంటే.. ఈ రెండు కలర్స్‌లో ఏదో ఒకటి ప్రిఫర్‌ చేస్తారు. అలాగే ప్రభాస్‌ మంచి భోజనప్రియుడు. అతనే కాదు, కృష్ణంరాజుతోపాటు అతని ఫ్యామిలీలోని అందరూ భోజనప్రియులే. తాము ఇష్టంగా తినడమే కాదు, ఇతరులకు వడ్డించే విషయంలోనూ ఒక ప్రత్యేకతను కలిగి ఉంటుంది ఆ కుటుంబం. ముఖ్యంగా ప్రభాస్‌.. అతిథి మర్యాదలకు పెట్టింది పేరు. ప్రభాస్‌ ఫుడ్‌ పెట్టి మరీ చంపేస్తాడు అంటూ ఎన్టీఆర్‌, పృథ్విరాజ్‌ సుకుమారన్‌ వంటివారు ప్రశంసించడమే దానికి ఉదాహరణ. ప్రభాస్‌ సినిమా జరుగుతున్నప్పుడు ఆర్టిస్టులకు, టెక్నీషియన్స్‌కి అతని ఇంటి నుంచే భోజనాలు వస్తాయి. ప్రభాస్‌కి చాక్‌లెట్‌ అంటే మహా ఇష్టం. చివరికి ఐస్‌క్రీమ్‌ కూడా చాక్‌లెట్‌దే అయివుండాలి.

ప్రభాస్‌కి ఇష్టమైన స్పోర్ట్‌ వాలీబాల్‌. తనకు టైమ్‌ దొరికినపుడు వాలీబాల్‌ ఆడుతుంటారు. దానికి వీలుగా తన ఇంటి ఆవరణలోనే ఒక వాలీబాల్‌ కోర్టును కూడా ఏర్పాటు చేసుకున్నారు. ప్రభాస్‌కి పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టం. అందుకే తన ఇంటిలోనే ఓ చిన్నపాటి లైబ్రరీని ఏర్పరుచుకున్నారు. ఖాళీ సమయాల్లో పుస్తకాలు చదువుతూ టైమ్‌ పాస్‌ చేస్తుంటారు. ప్రభాస్‌ బద్ధకస్తుడనే పేరు ఉంది. ఈ విషయాన్ని స్వయంగా రాజమౌళి చెప్పడం విశేషం. ఏ పని చెయ్యాలన్నా తర్వాత చూద్దాంలే అని వాయిదా వేస్తూ ఉంటారట. అయితే సెట్స్‌లో పూర్తి రివర్స్‌గా ఉంటుంది. సినిమా కోసం ప్రభాస్‌ ఎంత కష్టమైనా పడతారు.

చెన్నయ్‌లోని డాన్‌ బాస్కో స్కూల్‌లో చదివేరోజుల్లో ప్రభాస్‌ ఒక టీచర్‌ని బాగా ఇష్టపడేవారు. అదే అతని మొదటి క్రష్‌. ఆ టీచర్‌ మొహం ఇప్పటికీ తనకు గుర్తుందని చెబుతారు ప్రభాస్‌. అతనికి కవితలంటే ఎంతో ఇష్టం. అయితే కవితలు రాయడం అతనికి తెలీదు. అందుకే టీనేజ్‌ టైమ్‌లో ఎవరైనా అమ్మాయి నచ్చితే మంచి కొటేషన్స్‌ వున్న గ్రీటింగ్‌ కార్డ్స్‌ తీసుకెళ్లి ఇచ్చేవారట. తమది క్షత్రియుల వంశం కావడం వల్ల మహారాజులు ధరించే దుస్తులంటే ప్రభాస్‌కి చాలా ఇష్టం. అలాంటి దుస్తులు ధరించాలని చిన్నప్పటి నుంచీ ఉండేది. ఆ కోరిక బాహుబలితో తీరిందట.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.