English | Telugu

ఇది అసలు సిసలు సంక్రాంతి అంటే.. డార్లింగ్ వింటేజ్ లుక్ అదిరింది!

వింటేజ్ డార్లింగ్ ని చూడటం కోసం రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు ఆ రోజు రానే వచ్చింది. ఈ సంక్రాంతికి లుంగీ కట్టి మరీ రాజా లాగా ఎంట్రీ ఇచ్చాడు ప్రభాస్.

మారుతి దర్శకత్వంలో ప్రభాస్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ మూవీ నుంచి సంక్రాంతి కానుకగా టైటిల్, ఫస్ట్ లుక్ ను రివీల్ చేశారు. ఈ సినిమాకి 'రాజా డీలక్స్' అనే టైటిల్ ప్రచారంలో ఉండగా.. మేకర్స్ మాత్రం 'ది రాజా సాబ్' అనే టైటిల్ ను అనౌన్స్ చేశారు. ఇక ఈ 'రాజా సాబ్' నుంచి రిలీజ్ చేసిన ప్రభాస్ ఫస్ట్ లుక్ కూడా అదిరిపోయింది. లుంగీ కట్టుకుని ప్రభాస్ స్టైల్ గా ఉన్నాడు. క్లాస్, మాస్ కలగలిసి వింటేజ్ ప్రభాస్ ని గుర్తు చేస్తుంది ఈ పోస్టర్. లుక్, గెటప్ చూస్తుంటే ఇది పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమా కాదు.. మన డార్లింగ్ సినిమా అనుకునేలా ఉంది.

తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఈ ఏడాదే ఈ సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.