English | Telugu

1800 థియేటర్లలో పవన్ "పంజా"

సంఘమిత్ర మరియూ అర్కా మీడియా పతాకాలపై, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, సారాజేన్ దియాస్ హీరోయిన్ గా, అడవి శేష్, అంజలీ లావణ్య మరో జంటగా నటిస్తూండగా, ప్రముఖ తమిళ దర్శకుడు విష్ణువర్థన్ దర్శకత్వంలో, నీలిమ తిరుమల శెట్టి, శోభు యార్లగడ్డ, నగేష్ ముంత, ప్రసాద్ దేవినేని నిర్మిస్తున్న విభిన్న కథా చిత్రం "పంజా". ఈ "పంజా" చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా 1800 థియేటర్లలో థియేటర్లలో విడుదల చేస్తున్నారు.

అంటే ఈ 1800 థియేటర్లలో పవన్ "పంజా" తొలి రోజున సుమారు 8 వేల నుండి 9 వేల షోల వరకూ వేసే అవకాశముందని పవన్ కళ్యాణ్ అభిమానులు అంటున్నారు. ఈ లెక్కన పవన్ సినిమా హిట్టయినా, ఫట్టయినా ఓపెనింగ్స్ భారీగా ఉంటాయి కనుక ఈ చిత్రం తొలి రోజు కలెక్షన్లు బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేసే అవకాలున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.