English | Telugu

క్రికెట్ వరల్డ్ కప్పు ఇండియా గెలిస్తే నగ్నంగా నడుస్తా- పూనమ్

క్రికెట్ వరల్డ్ కప్పు ఇండియా గెలిస్తే నగ్నంగా నడుస్తా- పూనమ్

"కప్పు గెలిస్తే నగ్నంగా నడుస్తా"నని పూనమ్ అందట. పూనమ్ అంటే కంగారుపడి అపార్థం చేసుకోకండి. ఈ పూనమ్ మన తెలుగు సినిమా "మాయాజాలం"లో హీరోయిన్ గా, అలాగే "గగనం" చిత్రంలో నటించిన నటి పూనమ్ కౌర్ కాదు. ఈ పూనమ్ ముంబాయి టాప్ మోడల్ పూనమ్ పాండే. కప్పు గెలిస్తే అంటే ఇండియా గనక క్రికెట్ వరల్డ్ కప్ గనక గెలిస్తే తాను నగ్నంగా నడుస్తానని అంది పంతొమ్మిదేళ్ళ టాప్ మోడల్ పూనమ్ పాండే. అది కూడా మ్యావ్ జరిగిన స్టేడియంలోనే తాను అలా నగ్నంగా నడుస్తానని అంది.


దీనర్థం ఏమిటమ్మా పూనమ్ పాండే ...? ఇండియాకు కప్పు గెలిచే సత్తా లేదనా...? లేదంటే నిన్ను నగ్నంగా చూడటానికైనా ఇండియన్ టీమ్ క్రికెట్ వరల్డ్ కప్పు గెలుస్తుందనా...? ఏది ఏమైనా క్రికెట్ వరల్డ్ కప్ మేనియా చాలా భయంకరంగా ఉన్న ఈ సమయంలో పబ్లిసిటీ కోసం టాప్ మోడల్ తాను నిజంగానే అన్నమాట మీద నిలబడుతుందా...? లేక ఇదంతా పబ్లిసిటీ స్టంటా అని ముంబాయి వాసులు అనుకుంటున్నారు.