English | Telugu

ఏయ్... నేను బుర్ఖా వేసుకోవాలా ?

బాలీవుడ్ హాట్ బ్యూటీ పూనమ్ పాండేను ఇటీవలే పోలీసులు అరెస్టు చేసిన విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ విషయంపై పూనమ్ తీవ్ర నిరసన వ్యక్తం చేస్తుంది. తాగిన మత్తులో అసభ్యంగా చిందులేసానని నాపై కేసు పెట్టడం అర్థంలేని పని. ఆ రోజు రాత్రి నా సోదరుడు ఆదిత్యతో కలిసి కారులో వెళుతున్న నన్ను పోలీసులు ఆపారు. కారులో మ్యూజిక్ వింటున్న నన్ను అసభ్యంగా ప్రవర్తించావంటూ నింద మోపారు. నేను ఒక మోడల్‌ అని తెలిసాక వారు మరింత రెచ్చిపోయి నానా హంగామా చేసారు. పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లి చాలా ప్రశ్నలు అడిగారు అని బాధపడింది. అయినా ప్రతిఒక్కరూ నన్నే టార్గెట్ చేయడం విడ్డురంగా ఉంది. నిజానికి ఎంతో మంది అమ్మాయిలు అర్థనగ్నంగా దుస్తులు వేసుకొని తిరుగుతున్నా కూడా వారిని పట్టించుకోరు. కానీ నాలాంటి వారిపై మాత్రం ఇలా రెచ్చిపోతారు. కారులో పాటలు వినడం ఏమైనా నేరమా? అంటూ ప్రశ్నించింది. మీలో ఇంకా ఇదే మెంటాలిటీ కొనసాగితే ఇక నేను బుర్ఖా వేసుకొని తీరగాల్సిందే. అంటూ పూనమ్ ట్విట్టర్ ద్వారా తన భాధను పంచుకుంది.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.