English | Telugu

గంటన్నరపాటు పోలీసువిచారణలో ప్రీతి

బాలీవుడ్ నటి ప్రీతి జింటా మంగళవారం పోలీసులకు తన స్టేట్‌మెంట్ ఇచ్చారు. వ్యాపారవేత్త, మాజీ ప్రియుడు నెస్ వాడియాతో ఆమెకు విబేధాలు తలెత్తిన సంగతి తెలిసిందే. మే 30వ తేదిన వాంఖడే స్టేడియంలో వాడియా తనను వేధించినట్లు ఆమె పోలీసులకు జూన్ 12 న ఫిర్యాదు చేసింది. అదే స్టేడియంలో మంగళవారం ఆమె తన వాంగ్మూలాన్ని పోలిసులకు ఇచ్చారు. ఈ వాంగ్మూలం రికార్డు చేయడానికి గంటన్నర సమయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ టోర్నమెంట్‌లో భాగంగా కింగ్స్-11 పంజాబ్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతున్న సమయంలో వాడియా తనను వేధించినట్లు, తనని అగౌరవ పరిచినట్లు ప్రీతిజింటా పోలీసులకు కంప్లైంట్ చేసింది. ఘటన అనంతరం ఆమె అమెరికా వెళ్లిపోయింది. కేసు విచారణ నిమిత్తం పోలీసులు ఆమెను ఇండియాకు రావలసిందిగా కోరారు. ఆదివారం ముంబై వచ్చిన ప్రీతి మంగళవారం నాడు పోలీసులకు, వాంఖడే స్టేడియంలలో తన స్టేట్‌మెంటును ఇచ్చారు. ఘటనా సమయంలో జరిగిన ప్రతి విషయాన్ని ఆమె పోలీసులకు వివరంగా తెలియచేసినట్లు తెలుస్తోంది.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.