English | Telugu

పీటర్ హెయిన్స్ కు టారస్ వరల్డ్ స్టంట్ అవార్డు

పీటర్ హెయిన్స్ కు "టారస్ వరల్డ్ స్టంట్ అవార్డు" లభించింది. వివరాల్లోకి వెళితే ఆ మధ్య "మగధీర" చిత్రంలో ఒక యాక్షన్ ఎపిసోడ్ కంపోజ్ చేస్తున్నప్పుడు తీవ్రంగా గాయపడ్డ పీటర్ హెయిన్స్ కు ప్రతిష్టాత్మక అంతర్జాతీయ "టారస్ వరల్డ్ స్టంట్ అవార్డు" లభించింది. పీటర్ హెయిన్స్ అంటే "అపరిచితుడు, శివాజీ, గజినీ, మగధీర, రావణ్, డార్లింగ్, మర్యాదరామన్న, బృందావనం, ఆరెంజ్ " వంటి చిత్రాలకు యాక్షన్ సీన్లను కంపోజ్ చేసిన ఫైట్ మాస్టర్. పైన ఉదహరించిన సినిమాల్లోని యాక్షన్ సీన్లు ఏలా ఉంటాయో మనకు తెలిసిందే.

అవన్నీ నిజమేనని మనం నమ్మేంత వాస్తవంగా ఉండేలా ఆ యా చిత్రాల్లోని యాక్షన్ సీన్లను కంపోజ్‍ చేశాడు ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్స్. అలాంటి పీటర్ హెయిన్స్ కి ప్రతిష్టాత్మక అంతర్జాతీయ "టారస్ వరల్డ్ స్టంట్ అవార్డు" లభించింది. ఈ ప్రతిష్టాత్మక అంతర్జాతీయ "టారస్ వరల్డ్ స్టంట్ అవార్డు"ని మే నెలలో 14 వ తేదీన అమెరికాలో కాలిఫోర్నియాలో జరగబోయే ఒక సభలో పీటర్ హెయిన్స్ కు ఈ ప్రతిష్టాత్మక అంతర్జాతీయ "టారస్ వరల్డ్ స్టంట్ అవార్డు" అందిస్తారు. ఈ సందర్భంగా పీటర్ హెయిన్స్ కు తెలుగు వన్ అభినందనలు తెలియజేస్తోంది.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.