English | Telugu

పవన్ కు ఆపరేషన్ చేయాల్సిందే

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండు సంత్సరాలుగా వెన్నునొప్పితో బాధపడుతున్న విషయం తెలిసిందే. కానీ గత మూడు నెలలుగా ఈ నొప్పి అధికమైందని సన్నిహుతులు తెలియజేశారు. ఆమధ్య ఈ వెన్నునొప్పి చికిత్స కోసం బెంగుళూరు వెళ్లగా అక్కడి డాక్టర్లు తప్పినిసరిగా సర్జరీ చేయించాలని సూచించారట. కానీ పవన్ కళ్యాణ్ ఫిజియోథెరపీ మాత్రమే చేయించుకొని వచ్చారట. ఇప్పుడు సర్జరీ చేయించుకుంటే తాను సైన్ చేసిన సినిమాలు వాయిదా పడుతాయని, అవి కంప్లీట్ చేసిన తరువాత సర్జరీ చేయించి నాలుగైదు వారాలు రెస్ట్ తీసుకోవాలని పవన్ ఆలోచిస్తున్నాడట. కానీ పవన్ సన్నిహితులు మాత్రం వెంటనే చేయించుకోవాలని ఒత్తిడి చేస్తున్నారట. మరో వారంతో 'గోపాల గోపాల'లో తన పార్ట్ కంప్లీట్ అవుతుందని తర్వాత సర్జరీకి వెళ్ళాలా లేదా గబ్బర్ 2 సెట్స్‌‌కు వెళ్ళాలా అనే డైలమాలో ఉన్నట్టు సన్నిహితులు అంటున్నారు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.