English | Telugu

పవన్ కళ్యాణ్ సంచలన ట్విట్

పవర్‌స్టార్ పవర్ కళ్యాణ్ ఈరోజు ట్విట్లర్లో చేసిన ట్విట్ రాజకీయంగా సంచలనం సృష్టించింది. గత ఎన్నికల్లో తెలుగుదేశం, బీజేపీకి అనుకూలంగా ప్రచారం చేసిన పవన్ కళ్యాణ్ కి బాబు, మోడీ దగ్గర ప్రత్యేక గౌరవం వుంది. ఈ నేపథ్యంలో అయన తాజాగా ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదాపై ట్విట్టర్ లో కొన్ని ట్విట్లు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో భారతీయ జనతా పార్టీ మాట ఇచ్చిందని, ఇప్పుడు ఆ మాట నిలుపుకునే సమయం వచ్చిందని, బీజేపీ మాట తప్పదని భావిస్తున్నానని పవన్ కళ్యాణ్ ట్విట్లర్లో పోస్ట్ చేశారు. అయితే ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనంటూ పవన్ కళ్యాణ్ ముందుకు రావడం హర్షించదగ్గ పరిణామం అని రాజకీయ నిపుణులు అంటున్నారు. మరి పవన్ భావిస్తున్నట్టుగా బిజెపి తన మాట మీద నిలబడుతు౦దా? అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.