English | Telugu
పటాస్ దెబ్బకి పవన్ ఔట్
Updated : Feb 8, 2015
నందమూరి హీరో కల్యాణ్‌రామ్ పవన్ కల్యాణ్‌కి గట్టి షాకే ఇచ్చాడు. పటాస్ తో.. గోపాల గోపాలకు చెక్ పెట్టాడు. ఈ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన పవన్ - వెంకీల మల్టీస్టారర్ గోపాల గోపాల. పవన్‌కి పోటీగా వచ్చిన 'ఐ' సినిమా తేలిపోవడంతో గోపాల గట్టెక్కింది. తొలివారంలో రూ.30 కోట్లకు పైనే వసూళ్లు సాధించి బాక్సాఫీసు దగ్గర దూసుకుపోయింది. ఈ సినిమా కచ్చితంగా రూ.50 నుంచి రూ.60 కోట్లు సాధిస్తుందని ట్రేడ్ వర్గాలు లెక్కగట్టాయి. అయితే.. పటాస్ రాకతో గోపాల గోపాల జాతకం తారుమారైంది. జనవరి 23న బాక్సాఫీసు ముందుకొచ్చిన పటాస్ బీసీ ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. దాంతో రెండోవారంలో అంతంతమాత్రంగా ఉన్న గోపాల గోపాల వసూళ్లకు పూర్తిగా గండి పడింది. రూ.60 కోట్లు కాదు కదా, రూ.50 కోట్ల మైలు రాయిని అందుకోవడమే గగనం అయిపోయింది. గోపాల గోపాల వల్ల డిస్ట్యుబ్యూటర్లేం నష్టపోలేదు గానీ.. లాభాలు మాత్రం రాలేదు. కొన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ ని కూడా సాధించలేకపోయిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ యేడాది తొలిసారి లాభాలు చూద్దామనుకొన్న పంపిణీ దారుల ఆశలకు పటాస్ గండికొట్టినట్టైంది. పటాస్ విజృంభణతో చాలాచోట్ల గోపాల గోపాలని తీసేశారు కూడా. థియేటర్లు సురేష్ బాబు చేతుల్లో ఉన్నాయి కాబట్టి సరిపోయింది... లేదంటే సగం థియేటర్లు లేచిపోవాల్సిన పరిస్థితి. మొత్తానికి కల్యాణ్ రామ్ సైలెంట్‌గా వచ్చి సెన్సేషన్ సృష్టించాడు.