English | Telugu

భయపెట్టే వాళ్ళకోసం తులసీరామ్ వేట

"మంత్ర", "మంగళ" వంటి చిత్రాలతో భయపెట్టిన దర్శకుడు ఓషో తులసీరామ్ మరో చిత్రానికి శ్రీకారం చుట్టాడు. మంత్ర ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ లో సి.హెచ్.వి. శర్మ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గతంలో తులసీరామ్ తీసిన "మంత్ర", "మంగళ" చిత్రాలు జనాలను బాగా భయపెట్టాయి.

అయితే ఈ కొత్త చిత్రంలో మరింత భయపెట్టే కథను రెడీ చేసినట్లు తెలిసింది. ఈ చిత్రానికి సంబంధించిన నటీనటుల ఎంపికలు జరుగుతున్నాయి. మరి ఈ సెలక్షన్స్ లో ఎంపిక అయినవారు ఎంత భయపెడతారో చూడాలి.

మరి ఈ సందర్భంగా ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసారు. ఆ పోస్టర్ మీకోసం. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

రూమర్స్ కి చెక్.. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మొత్తం చెప్పేసింది

సిల్వర్ స్క్రీన్ పై పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)స్టామినాని మరింతగా ఎలివేట్ చెయ్యబోతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad.ఇప్పటి వరకు రిలీజైన ప్రచార చిత్రాల ద్వారా ఆ విషయం అర్ధమవుతుండటంతో పాటు దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఆ విషయంలో అభిమానులకి, ఫ్యాన్స్ కి పూర్తి భరోసాని ఇస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవికి థియేటర్స్ లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి ప్రముఖ హీరోయిన్ సాక్షి వైద్య చెప్పిన కొన్ని విషయాల ద్వారా ఎప్పట్నుంచో సినీ సర్కిల్స్ లో దర్జాగా చక్కర్లు కొడుతున్న ఒక పుకారు కి  పుల్ స్టాప్ పడినట్లయింది.