English | Telugu

బాలయ్య ఎంట్రీ అదిరిపోయింది

బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం అందరికి తెలిసిందే. ఆగిపోయింది అని అనుకున్న ఈ చిత్ర షూటింగ్ మళ్ళీ మొదలైంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుంది.

బాలకృష్ణ అంటేనే ఒక మెరుపు. అలాంటి ఒక మెరుపు కనపడాలంటే ఆ సీన్ ఎలా ఉండాలో ఆలోచించండి. అందుకు పదింతలు రెట్టింపు పవర్ తో బాలకృష్ణ ఇంట్రడక్షన్ సీన్ చిత్రీకరించారు. రామ్-లక్ష్మణ్ ఫైట్ మాస్టర్స్ నేతృత్వంలో బాలయ్య ఇంట్రడక్షన్ ఫైట్ సీన్ ను చిత్రీకరించారు.

"సింహ" తర్వాత వస్తున్న వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రంపై అభిమానులతో పాటు ఫిల్మ్ ఇండస్ట్రీ లో కూడా బాగా నమ్మకం ఏర్పడింది. ఎందుకంటే ఈ చిత్రం కోసం బోయపాటి తనదైన శైలిలో అద్భుతమైన కథను తయారుచేసాడంట. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఈ చిత్రానికి దేవీశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.