English | Telugu

యన్ టి ఆర్ ఊసరవెల్లి పోస్టర్

యన్ టి ఆర్ "ఊసరవెల్లి" పోస్టర్ బయటకొచ్చింది. వివరాల్లోకి వెళితే శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై, యంగ్ టైగర్ యన్.టి.ఆర్. హీరోగా, తమన్నా భాటియా హీరోయిన్ గా, సురేంద్ర రెడ్డి దర్శకత్వంలో, బి.వి.యస్.యన్.ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం "ఊసరవెళ్ళి". ఈ యన్.టి.ఆర్. "ఊసరవెల్లి" చిత్రం ఇప్పటికే 32 రోజుల తొలి షెడ్యూల్ పూర్తిచేసుకుంది. ఏప్రెల్ 16 వ తేదీ నుండీ రెండవ షెడ్యూల్ ప్రారంభమయ్యింది. ఈ యన్.టి.ఆర్. "ఊసరవెల్లి" చిత్రంలో 'కిక్' శ్యాం కూడా ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నారు.

ఈ యన్.టి.ఆర్. "ఊసరవెల్లి" పేరు వింటేనే ఈ చిత్రంలో హీరో యన్ టి ఆర్ పాత్ర ఎలా ఉండబోతోందో అర్థమవుతుంది. ఊసరవెల్లి అంటే అవసరాన్ని బట్టి రంగులు మార్చేది అని అర్థం. తొండ ముదిరితే ఊసరవెల్లిగా మారుతుందంటారు. ఈ యన్.టి.ఆర్. "ఊసరవెల్లి" చిత్రంలో యన్.టి.ఆర్. పాత్ర ఎన్ని రంగులు మార్చుతుందో ఆగస్టు నెలలో ఈ చిత్రం విడుదలయ్యాక కానీ మనకు తెలియదు.

గతంలో యన్.టి.ఆర్. , సురేంద్ర రెడ్డిల కాంబినేషన్ లో "అశోక్" అనే చిత్రం వచ్చింది. ఆ చిత్రం ఫరవాలేదనిపించే స్థాయిలో ఆడింది. ఆ తర్వాత వాళ్ళిద్దరి కాంబినేషన్ లో వస్తున్న చిత్రం ఈ యన్ టి ఆర్ "ఊసరవెల్లి". అదీగాక ఇటీవల విడుదలైన యన్.టి.ఆర్., ఇలియానా జంటగా, మెహెర్ రమేష్ దర్శకత్వంలో వచ్చిన "శక్తి" చిత్రం ఫ్లాపవటంతో ప్రస్తుతం ఈ యన్ టి ఆర్ "ఊసరవెల్లి" చిత్రం మీద యన్ టి ఆర్ చాలా ఆశలు పెట్టుకున్నారు.ఈ "ఊసరవెల్లి" చిత్రంతో పాటు బోయపాటి దర్శకత్వంలో శృతి హాసన్ హీరోయిన్ గా, క్రియెటీవ్ కమర్షియల్స్ పతాకంపై, కె.యస్.రామారావు నిర్మిస్తున్న చిత్రంలో కూడా యన్ టి ఆర్ నటిస్తున్నారు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.