English | Telugu

జంధ్యాలతో పోల్చడం ఇబ్బందిగా వుంది



మూడు వారాలుగా విజయవంతంగా కొనసాగుతున్న చిన్న సినిమా ఊహలు గుసగుసలాడే. చిన్న సినిమా సాధించిన ఈ పెద్ద విజయంతో చాలా హ్యాప్పీగా ఉన్నారు చిత్ర యూనిట్ అంతా. ముఖ్యంగా ఏ సెంటర్, మల్టీప్లెక్స్ ల్లో మాత్రమే బాగా ఆడుతుందని మొదట్లో అనుకున్నా ఈ చిత్రం ఇప్పుడు బి సెంటర్లలో కూడా హౌస్‌ఫుల్ కలెక్షన్లతో రన్ అవుతోంది. ఈ ఫిలిం మొదటి రోజు కలెక్షన్లు కూడా పూరే. అయినా ఆ తర్వాత మౌత్ టాక్ తో మంచి కలెక్షన్లు వస్తున్నాయని చిత్ర దర్శకుడు అవసరాల శ్రీనివాస్ తెలిపారు. మూడో వారం నుంచి ఈ సినిమా ప్రదర్శన థియేటర్ల సంఖ్యను కూడా పెంచుతున్నట్లు ఆయన తెలిపారు.
క్లీన్ కామెడీతో సాగిపోయే ఈ చిత్రాన్ని అన్ని వర్గాల ఆడియన్స్ అభిమానించడం ఆనందంగా వుందన్నారు. సినిమా చూసి ప్రేక్షకులు చాలామంది తమ అభినందనలను, ఆనందాన్ని తెలియచేస్తున్నందుకు మరింత సంతోషాన్నించిందన్నారు. సినిమా చూసిన వారు జంధ్యాల సినిమా చూసినట్లుందని అంటున్నారు. ఈ విషయం ప్రస్తావించినప్పుడు, జంధ్యాల చాలా గొప్పవారు, నేను ఆయనంతటి వాడిని కాను. అంతటి గొప్ప వ్యక్తితో పోల్చడం ఇబ్బందిగా వుంటుందన్నారు అవసరాల శ్రీనివాస్. అయితే జంధ్యాల సినిమాలు చూసినప్పుడు కలిగే ఆనందం తన సినిమా చూసినప్పుడు కలిగితే మాత్రం ఆనందమే అని చెప్పారు.


'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.