English | Telugu

రెండవ సినిమా ఎందుకు కలసిరాదు

తొలిసారి సూపర్ డూపర్ హిట్టిచ్చి అదే కాంబినేషన్ రెండవసారి మరో సినిమా తీస్తే సూపర్ ఫ్లాపవుతుంది. ఆ తమాషా ఏంటో చూద్దాం. మహేష్ బాబుతో దర్శకుయడు గుణశేఖర్ "ఒక్కడు" అనే బ్లాక్ బస్టర్ హిట్ తీశాడు. ఆ సినిమా మహేష్ బాబుకి చాలా పెద్ద ఇమేజ్ తెచ్చిపెట్టింది. ఆ తర్వాత "అర్జున్, సైనికుడు" చిత్రాలు దెబ్బతిన్నాయి. అలాగే ఇలియానాతో వై.వి.యస్.చౌదరి "దేవదాస్" తో బ్లాక్ బస్టర్ హిట్టిచ్చి "సలీం" ఫ్లాపిచ్చాడు.

ఇలియానాతో పూరీ జగన్నాథ్ "పోకిరి" వంటి ఆల్ టైమ్ హిట్ తీసిన తర్వాత ""నేను-నా రాక్షసి" అనే ఫ్లాపిచ్చాడు. మహేష్ బాబుతో త్రివిక్రమ్ "అతడు" వంటి క్లాస్ హిట్టిచ్చి రెండవ సినిమా 'ఖలేజా" ఆశించిన స్థాయిలో విజయం సాధించేలా చేయలేకపోయాడు. అల్లు అర్జున్ తో వి.వి.వినాయక్ "బన్నీ" వంటి హిట్టిచ్చి రెండవ సినిమా "బద్రీనాథ్" వంటి ఫ్లాపిచ్చాడు. ఎందుకనో మన తెలుగు సినీ పరిశ్రమలో ఇలా కొందరికి రెండవ సినిమా కలసి రాదు.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.