English | Telugu

మేలుకుంటున్న మన హీరోలు

అదేంటయ్యా ఇప్పటి వరకూ మన హీరోలు నిద్దరోతున్నారనా నీ ఉద్దేశం "మేలుకుంటున్న మన హీరోలు" అని హెడ్డింగ్ పెట్టావని మీరు అనుకోవచ్చు. కానీ ఇది నిజం... రెండేళ్ళకి ఒక సినిమా చేస్తాడు ఆ హీరో చాలా బద్దకస్తుడు అని పేరు తెచ్చుకున్న మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ వంటి పెద్ద హీరోలంతా రెచ్చిపోయి వరసగా సినిమాల్లో నటిస్తున్నారు. అలాగే యన్ టి ఆర్, ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్ తేజ తదితర యువ హీరోలంతా జూలు విదిలిస్తున్నారు. అలాగే తమ డబ్బింగ్ సినిమాలతో మన థియేటర్ల మీద దాడి చేస్తూ మన డబ్బుని కొల్లగొడుతున్న తమిళ హీరోల మీద మన హీరోలు దెబ్బకు దెబ్బ పగ తీర్చుకుంటున్నారు.

అంటే ప్రస్తుతం తాము నటిస్తున్న సినిమాలను తమిళంలో కూడా విడుదల చేయటానికి వీలుగా ప్లాన్ చేసుకుంటున్నారు. వీళ్ళందరిలో ముందువరసలో ఉన్న అల్లరి నరేష్ ఇప్పటికే "పోరాలి" అనే ఒక తమిళ సినిమాలో నటించాడు అదే తెలుగులో "సంఘర్షణ"గా విడుదల కాబోతూంది. రవితేజ గురించి ఎందుకు రాయలేదంటే రవితేజ నిరంతరం ఒక ప్రవాహంలా తన సినిమాలు వచ్చేలా కష్టపడుతూంటాడు కనుక. ఆయన హీరోగా నటిస్తున్న "నిప్పు" చిత్రం సంక్రాంతికి రానుంది.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.