English | Telugu
రజనీ కాంత్ పై ఎన్టీఆర్ సంచలన ట్వీట్..సోషల్ మీడియాలో ఫ్యాన్స్ రచ్చ!
Updated : Dec 12, 2023
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఏది చేసినా కూడా అది సంచలనమే అవుతుంది. ఎన్టీఆర్ నుంచి వచ్చే మాట కోసం ఆయన పిలుపు కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తుంటారు. ఎదురు చూడటమే కాదు ఆయన ఏది చెప్తే అది చెయ్యడానికి కూడా సిద్ధంగా ఉంటారు. తాజాగా ఎన్టీఆర్ రజినీకాంత్ బర్త్ డే సందర్భంగా చేసిన ఒక ట్వీట్ టాక్ అఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. ఈ సందర్బంగా సోషల్ మీడియాలో ఎన్టీఆర్ అభిమానులు చేస్తున్న హంగామా కూడా చర్చినీయాంశమయ్యింది.
ఎన్టీఆర్ తన ట్విట్టర్ ద్వారా రజనీకాంత్ కి జన్మ దిన శుభాకాంక్షలు చెప్పారు. అంతటితో ఆగకుండా రజనీ సార్ ఇండియాలో మీరే మాత్రమే తలైవర్ అలాగే మీ చరిష్మా తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటుందని కూడా చెప్పాడు. ఇప్పుడు ఎన్టీఆర్ ట్వీట్ ని చూసిన రజనీ ఫాన్స్ ఎన్టీఆర్ కి రజనీ అంటే ఎంతో ఇష్టముంది కాబట్టే అలా ట్వీట్ చేసాడని అంటున్నారు. ఇక ఎన్టీఆర్ ఫాన్స్ గుంరించి అయితే చెప్పక్కర్లేదు. తమ అభిమాన హీరో ఎన్టీఆర్ రజనీకాంత్ కి విషెస్ చెప్పగానే వాళ్ళు కూడా రజనీకి బర్త్ డే విషెస్ చెప్తు సోషల్ మీడియాలో నానా హంగామా చేస్తున్నారు.
రజనీకాంత్,ఎన్టీఆర్ ఇద్దరికి కూడా మాస్ ఆడియెన్స్ లో ఫుల్ ఇమేజ్ ఉంది. ఒక రకంగా చెప్పాలంటే ఇద్దరినీ కంబైన్డ్ గా అభిమానించే ఫాన్స్ కూడా చాలా మంది ఉన్నారు. ఈ విషయం చాలా సార్లు రుజవయ్యింది కూడా. భాషలతో సంబంధంలేకుండా ఇండియన్ సినిమా పరిశ్రమకి చెందిన అతిరధ మహారధులందరు రజనీకి జన్మదిన శుభాకాంక్షలు చెప్తున్నారు.