English | Telugu

ఎన్టీఆర్‌ ‘టెంపర్‌’ ఫస్ట్ లుక్ పోస్టర్

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ హీరోగా శివబాబు బండ్ల సమర్పణలో పరమేశ్వర ఆర్ట్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో అగ్ర నిర్మాత బండ్ల గణేష్‌ నిర్మిస్తున్న చిత్రానికి ‘టెంపర్‌’ టైటిల్‌గా కన్‌ఫర్మ్‌ చేశారు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను ఈరోజు విడుదల చేశారు.

ఈ సందర్భంగా నిర్మాత బండ్ల గణేష్‌ మాట్లాడుతూ - ‘‘ఎన్టీఆర్‌, పూరి జగన్నాథ్‌గార్ల కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా మా బేనర్‌లో నిర్మిస్తున్న ఈ చిత్రానికి టైటిల్‌ ‘టెంపర్‌’గా కన్‌ఫర్మ్‌ చేశాం. ఈ చిత్రానికి సంబంధించి 80 శాతం షూటింగ్‌ పూర్తయింది. డిసెంబర్‌ రెండో వారంలో కనీ వినీ ఎరుగని రీతిలో చాలా గ్రాండ్‌గా ఆడియో ఫంక్షన్‌ని జరపబోతున్నాం. జనవరి 9న సంక్రాంతి కానుకగా వరల్డ్‌వైడ్‌గా ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేస్తున్నాం. ఎన్టీఆర్‌ కెరీర్‌లో ‘టెంపర్‌’ ఓ మైల్‌స్టోన్‌గా నిలిచిపోయేలా ఈ చిత్రాన్ని పూరి జగన్నాథ్‌గారు రూపొందిస్తున్నారు. అలాగే మా బేనర్‌లో ఈ చిత్రం మరో ప్రెస్టీజియస్‌ మూవీ అవుతుంది’’ అన్నారు.

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ సరసన కాజల్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రకాష్‌రాజ్‌, కోట శ్రీనివాసరావు, తనికెళ్ళ భరణి, ఆలీ, పోసాని కృష్ణమురళి, సుబ్బరాజు, మధురిమ బెనర్జీ, వెన్నెల కిషోర్‌, జయప్రకాష్‌రెడ్డి, సప్తగిరి, కోవై సరళ, రమాప్రభ, పవిత్ర లోకేష్‌ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తారు.

ఈ చిత్రానికి కథ: వక్కంతం వంశీ, సినిమాటోగ్రఫీ: శ్యామ్‌ కె.నాయుడు, సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, ఆర్ట్‌: బ్రహ్మ కడలి, ఎడిటింగ్‌: ఎస్‌.ఆర్‌.శేఖర్‌, ఫైట్స్‌: విజయ్‌, సమర్పణ: శివబాబు బండ్ల, నిర్మాత: బండ్ల గణేష్‌, స్క్రీన్‌ప్లే-మాటలు-దర్శకత్వం: పూరి జగన్నాథ్‌.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.